నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర

  హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన డిజిథాన్, డిజిటల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో రెండు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ సాగింది. ఈ యాత్రను హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ జెండా ఊపి ప్రారంభించగా జిల్లాలో కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల సారథ్యంలోని టెక్కీల బృందం జిల్లాలోని 127 స్కూళ్లకు చెందిన 13,600 […] The post నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : నారాయణపేట జిల్లాలో రెండు రోజులపాటు నిర్వహించిన డిజిథాన్, డిజిటల్ యాత్ర విజయవంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రత్యక్ష పర్యవేక్షణ, ఉపాధ్యాయుల సహకారంతో రెండు రోజులపాటు విద్యార్థులకు శిక్షణ సాగింది. ఈ యాత్రను హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ జెండా ఊపి ప్రారంభించగా జిల్లాలో కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్ మక్తాల సారథ్యంలోని టెక్కీల బృందం జిల్లాలోని 127 స్కూళ్లకు చెందిన 13,600 మందికి విద్యార్థులకు శిక్షణ అందించింది. టీటా డిజిథాన్ యాత్రలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.

విద్యార్థులకు 16 గంటలపాటు నిర్వహించే శిక్షణలో భాగంగా 8, 9 తరగుతుల వారికి శిక్షణిచ్చారు. ఈ శిక్షణలో కంప్యూటర్ బేసిక్స్, ఇంటర్నెట్‌పై అవగాహన, ఈమెయిల్ క్రియేషన్, నగుదు రహిత లావాదేవీలు, గూగుల్ మ్యాప్స్, సెర్చింజన్‌పై శిక్షణ ఇచ్చారు. టెకీలంతా నారాయణపేట జిల్లాకు విచ్చేసి 2 రోజులు అక్కడే ఉండి డిజిటల్ లిటరసీతో పాటుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు అంశాలపై డిస్కషన్లు, విద్యార్థుల సృజనాత్మకతకు చెందిన మరికొన్ని కార్యక్రమాలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శిక్షణ చేపట్టారు.

హైదరాబాద్‌లోని బిఆర్‌కె భవన్‌లో ఐటి పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. టీటా చొరవను అభినందించిన ఆయన ఇప్పటికే 3 జిల్లాల్లో ఈ తరహా యాత్రలు విజయవంతంగా పూర్తయ్యాయని మిగుతా జిల్లాల్లోనూ ఇదే స్ఫూర్తితో తొందరగా శిక్షణ పూర్తి చేయాలని వారికి సూచించారు. అనంతరం హైదరాబాద్ నుంచి 130 మంది టెకీలు, నలుగురు వైద్యుల బృందం, సిస్టమ్ రిపేర్ బృందం విచ్చేసి నారాయణపేటలోని 127 పాఠశాలలకు చెందిన 13,600 మంది విద్యార్థులకు కంప్యూటర్ అక్షరాస్యతపై ప్రాథమిక అంశాలు నేర్పించారు. ఈ కార్యక్రమానికి తోడుగా నారాయణపేటలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో హ్యాకథాన్ నిర్వహించారు.

వందమంది విద్యార్థులతో నారాయణపేట జిల్లాలోని సమస్యలపై చాలెంజ్ అందించి పరిష్కారాలు కోరారు. నారాయణపేట జిల్లా డిజిటల్ యాత్రను స్థానిక కెజిబి వనంలో కలెక్టర్ హరిచందన వచ్చి ప్రారంభించారు. అనంతరం కొన్ని పాఠశాలలకు వెళ్లిన కలెక్టర్ శిక్షణను స్వయంగా పరిశీలించారు. డిజిథాన్ ట్రోవా అనే యాప్ ద్వారా ఎక్కడెక్కడ శిక్షణ ఎలా జరుగుుతుందో అధ్యయనం చేయవచ్చును. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మక్తాలతో సహా టీటా బృందంతో పలు కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.

విద్యార్థులు డిజిటల్ లిటరసీపై మరింత పట్టు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తాజా శిక్షణతో నాలుగు జిల్లాల్లో యాత్రలు పూర్తయ్యాయని, త్వరలో మరిన్ని జిల్లాల్లో ఈ యాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. శిక్షణలో పాల్గొన్న వారికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో శిక్షణ ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రవీందర్, టీటా తరఫున ప్రదీప్ నీలగిరి, సౌమ్య, శ్రీకాంత్, రమ్య, హారిక, శంకర్, సాయి, ధర్మేందర్, జ్ఞానకర్, నాగురాజు తదితరులు పాల్గొన్నారు.

Digital Trip in Narayanpet District

The post నారాయణపేట జిల్లాలో డిజిటల్ యాత్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: