నోరూరుంచే నాన్‌వెజ్!

  అందరూ ఆకుకూరలూ, కాయగూరలు, పచ్చడ్లు, పప్పులు తినేవారు ఉంటారని కాదు. కానీ చాలా మంది మాంసాహారం తినడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ముక్క ఉంటే కానీ ముద్ద దిగదు అని అంటుంటారు. అందులో చికెన్,మటన్,అంటే మరీ ఇష్ట పడతారు. వాటిల్లో ఈ కొత్త నాన్‌వెజ్ రుచులు అవేంటో చూద్దాం! కొబ్బరి పాలతో చికెన్ కర్రీ కావాల్సిన పదార్థాలు: చికెన్: ఒక కేజీ, పెరుగు: అరకప్పు,కొబ్బరిపాలు:ముప్పావు కప్పు, నిమ్మరసం:ఒక టీస్పూను, పసుపు:పావు టీస్పూను, ధనియాల పొడి ఒక […] The post నోరూరుంచే నాన్‌వెజ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అందరూ ఆకుకూరలూ, కాయగూరలు, పచ్చడ్లు, పప్పులు తినేవారు ఉంటారని కాదు. కానీ చాలా మంది మాంసాహారం తినడానికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ముక్క ఉంటే కానీ ముద్ద దిగదు అని అంటుంటారు. అందులో చికెన్,మటన్,అంటే మరీ ఇష్ట పడతారు. వాటిల్లో ఈ కొత్త నాన్‌వెజ్ రుచులు అవేంటో చూద్దాం!

కొబ్బరి పాలతో చికెన్ కర్రీ

కావాల్సిన పదార్థాలు: చికెన్: ఒక కేజీ, పెరుగు: అరకప్పు,కొబ్బరిపాలు:ముప్పావు కప్పు, నిమ్మరసం:ఒక టీస్పూను, పసుపు:పావు టీస్పూను, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, జీలకర్రపొడి: పావుటీస్పూను, కారం:రెండు టీస్పూన్లు, గసగసాలు: ఒకటీస్పూను, తరిగిన పాలు: ఒకటీస్పూను, తరిగిన ఉల్లిపాయలు:రెండు, గరం మసాలా:ఒక టీస్పూను, అనాసపువ్వు: ఒకటి, దాల్చిన చెక్క:చిన్న ముక్క, సన్నగా తరిగిన కొత్తిమీర టేబుల్‌స్పూన్లు, నూనె:రెండు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టీ స్పూన్లు, తరిగిన పచ్చిమిర్చి: ఒక టీసూను, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: చికెన్‌ను పెరుగు, ధనియాల పొడి, పసుపు,జీలకర్ర పొడి, నిమ్మరసం, సగం అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలిపి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పాలల్లో గసగసాలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. కుక్కర్‌లో నూనె పోసి వేడెక్కాక అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిరి, కారం వేసి వేగించాలి. ఆ తర్వాత నానబెట్టిన చికెన్ వేసి బాగా కలిపి నీళ్లు పోసి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత గరం మసాలా, కొబ్బరిపాలు వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.

చికెన్ ఘీ రోస్ట్
కావల్సినవి: చికెన్ – ముప్పావు కేజీ, గిలకొట్టిన పెరుగు – ముప్పావు కప్పు, కారం – చెంచా, పసుపు – అరచెంచా, నిమ్మరసం – పెద్ద చెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద – ఒకటిన్నర చెంచా, ఉప్పు – తగినంత.
మసాలా కోసం: ఎండుమిర్చి – ఆరు, మిరియాలు – అరచెంచా, మెంతులు – పావుచెంచా లవంగాలు – నాలుగు, జీలకర్ర, సోంపు – పావుచెంచా చొప్పున, ధనియాల పొడి – మూడు చెంచాలు, వెల్లుల్లి తరుగు – నాలుగు చెంచాలు, చింతపండు – ఉసిరికాయంత (వేడినీటిలో నానబెట్టుకోవాలి), బెల్లం తరుగు – రెండు చెంచాలు, నెయ్యి – అరకప్పు, ఉప్పు – తగినంత.
తయారీ: చికెన్ ముక్కల్ని శుభ్రం చేసి.. ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగూ, కారం, పసుపూ, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి ముద్దా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఇంతలో బాణలిని పొయ్యిమీద పెట్టి.. రెండు చెంచాల నెయ్యి వేయాలి. అది కరిగాక చింతపండూ, బెల్లం తరుగూ, ఉప్పూ తప్ప మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక నీళ్లు చల్లుకుంటూ ముద్దలా చేసుకోవాలి. బాణలిని మళ్లీ పొయ్యిమీద పెట్టి.. పెద్ద చెంచా నెయ్యి వేయాలి. అది కరిగాక చికెన్ ముక్కలు వేసి మూత పెట్టాలి. చికెన్ ఉడికిందనుకున్నాక ఇవతలకు తీసేయాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేసి ముందుగా చేసుకున్న మసాలా వేయాలి. దాని పచ్చివాసన పోయాక.. బెల్లం తరుగూ, కొద్దిగా చింతపండురసం, కొంచెం ఉప్పూ, చికెన్ ముక్కలూ వేసి.. బాగా కలపాలి. ఐదారు నిమిషాలయ్యాక దింపేస్తే చాలు.

నాటుకోడి కూర
కావల్సినవి: ఎముకలతో సహా నాటుకోడి – కేజీ, ధనియాలు- రెండు చెంచాలు, కొబ్బరికోరు- అర చెంచా, గసగసాలు- రెండు చెంచాలు. మసాలా కోసం: లవంగాలు, యాలకులు – రెండు చొప్పున, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అల్లంవెల్లులి ముద్ద – మూడు చెంచాలు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – అర చెంచా, కారం – మూడు చెంచాలు, ధనియాల పొడి – రెండు చెంచాలు, గరం మసాలా పొడి – అర చెంచా, టొమాటోలు – రెండు(సన్నగా తరగాలి), నూనె – అరకప్పు, పచ్చిమిర్చి – ఎనిమిది, ఉల్లిపాయలు – మూడు, కరివేపాకు – ఐదు రెబ్బలు.
తయారీ: నాటుకోడిని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కొట్టి పెట్టుకోవాలి. ధనియాలూ, గసగసాలను దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. దీనికి కొబ్బరికోరుని కూడా కలిపి కాసిని నీళ్లు చల్లి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిని పొయ్యిమీద పెట్టి.. నూనె వేడిచేయాలి. అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, అల్లంవెల్లుల్లిముద్ద వేయించాలి. రెండు మూడు నిమిషాలయ్యాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు, పసుపూ, కారం, ధనియాల పొడి, టొమాటో ముక్కలు, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఆపై కావాల్సినన్ని నీళ్లు వేసి ఇరవైనిమిషాల పాటూ మూతపెట్టి ఉడికించుకోవాలి. దీనిపై గసగసాల ముద్ద వేసి తక్కువ మంటమీద ఉడికించుకుని దింపేయాలి.

బొక్కల షేర్వా!
కావాల్సినవి: మూలగ బొక్కలు :అరకిలో ఉల్లితురుము: ఒక కప్పు,లవంగాలు:మూడు,యాలకులు:మూడు,దాల్చిన చెక్క:మూడు, జీలకర్ర:ఒక టీస్పూను, షాజీరా:ఒక టీస్పూన్,పసుపు:పావుటీస్పూన్, మెంతికూర తరుగు:ఒక కప్పు, టమోటో ముక్కలు:అరటీకప్పు, దోసకాయ ముక్కలు:ఒక కప్పు,పుదీనా తరుగు:అరకప్పు, కొత్తిమీర తరుగు:రెండు కారం:తగినంత, ఉప్పు:తగినంత, నూనె:తగినంత
తయారీ విధానం: బొక్కలు శుభ్రం చేసి కుక్కర్ వేసి నీళ్లు పోసి సన్నని మంటపై నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.తర్వాత ఒక గిన్నె స్టవ్‌పై పెట్టి నూనె పోసి వేడి చేసి జీలకర్ర, అవంగాలు, యాలకులు, షాజీరా,దాల్చిన చెక్క వేసి వేగించాలి. అవి వేగాక దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగించి, మెంతికూర, పుదీనా తరుగు వెయ్యాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించాలి. అవి బాగా ఉడికాక కుక్కర్‌లో బొక్కలను ఆ మిశ్రమంలో వేసి ఉడికించాలి. పదినిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు ఉడికిస్తే ఘుమఘుమలాడే ‘బొక్కల షేర్వా’ రెడీ.

బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్!
కావాల్సిన పదార్థాలు: చికెన్: ఒ క కేజీ (పెద్ద ముక్కలుగా కట్ చే యించు కోవాలి), మజ్జిగ: రెండు కప్పులు, మైదా: ఒక కప్పు, సోడా అరటీస్పూను, కా రం: ఒక టీ స్పూను, మిరియాల పొడి: అరటీస్పూను, వెల్లుల్లి ము ద్ద: అర టీ స్పూను, నూనె:వేగించడానికి సరిపడా,ఉప్పు: తగినంత.
తయారీ విధానం: చికెన్‌ను కడిగి మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసి గంటసేపు నానబెట్టాలి. తర్వాత మైదాలో కారం, సోడా ఉప్పు,మిరియాల పొడి, వె ల్లుల్లి ముద్ద, పదినిమిషాలు నాన
బెట్టాలి. తర్వాత బాణలిలో నూనెపోసి వేడెక్కాక చికెన్ ముక్కలను దోరగా కాల్చుకోవాలి.

Different types of Non Veg Recipes

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నోరూరుంచే నాన్‌వెజ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.