కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు…

  ఎంజిఎం : పుట్టి, పెరిగిన మట్టి ప్రాంతంలో ఉన్న అనుబంధాన్ని కొనసాగించిన వాడే అసలైన మనిషి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తన ఎదుగుదలకు పునాదిగా నిలిచిన వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బా ధ్యత ఆయా వ్యక్తులపై ఉన్నదని గుర్తు చేశారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ […] The post కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఎంజిఎం : పుట్టి, పెరిగిన మట్టి ప్రాంతంలో ఉన్న అనుబంధాన్ని కొనసాగించిన వాడే అసలైన మనిషి అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తన ఎదుగుదలకు పునాదిగా నిలిచిన వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన బా ధ్యత ఆయా వ్యక్తులపై ఉన్నదని గుర్తు చేశారు. శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృ ద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మహాజరైన పూర్వ విద్యార్థులను ఉద్దేశించి మం త్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యా ప్తంగా లక్షలాది మంది పేషెంట్లకు వైద్యసేవలు అందిస్తూ ప్రాణాలను నిలుపుతున్నారని అభినందించారు. పూర్వ విద్యార్థులు నేటి తరానికి స్ఫూ ర్తిగా వ్యవహరించాలని కోరారు. గత స్మృతులను మననం చేసుకునేందుకు ఇదొక అవకాశమని చెప్పారు. ఏ హోదాలో ఉన్నప్పటికి తరతమ బేధం లేకుండా పిలుచుకునే స్వేచ్ఛ సహచర విద్యార్థు లు, బాల్య మిత్రులకు మాత్రమే ఉంటుందన్నా రు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా పేదలకు మెరుగైన వైద్యాన్ని ఉచితం గా అందిస్తున్నట్లు తెలిపారు.

కంటివెలుగుతోపాటు కెసిఆర్ కిట్టు, డయాలసిస్ సెంటర్లు, సియూలను నెలకొల్పి ఆధునిక వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఫ్లోరైడ్ వ్యాధి మూలాలను గుర్తించి మిషన్ భగీరథ పథ కం ద్వారా మారుమూల గిరిజన, దళితవాడలో ఉన్న కుటుంబానికి కూడా సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తె లంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్లు తెలిపారు.

తెలంగాణ అస్తిత్వంపై ఉద్యమ సమయంలో కల్పించిన అపోహలను పటాపంచ లు చేసినట్లు తెలిపారు.గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల నుండి కాకతీయ మెడికల్ కళాశాల అభివృద్ధికి వి రాళాలు సేకరించుటకై వరంగల్ అర్బన్ జిల్లా క లెక్టర్ పేరున ప్రత్యేక బ్యాంకు ఖాతాను ప్రారంభించనున్నట్లు తెలిపారు. పేద పేషెంట్లకు మెరుగైన వైద్యసేవలు అందించినప్పుడే వృత్తికి న్యా యం చేకూరినట్లు పేర్కొన్నారు. ఎంజిఎం అభివృద్ధికి ప్రభు త్వం ఇటీవలనే రూ.10 కోట్లు మంజూ రు చేసినట్లు తెలిపారు.

Diamond Jubilee Celebrations of Kakatiya Medical College

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కాకతీయ మెడికల్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: