ధోనీకి చోటు కష్టమే

  సునీల్ గవాస్కర్ ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ లేకున్నా టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఒక్క న్యూజిలాండ్ సిరీస్‌లో తప్ప భారత్ మెరుగైన ప్రదర్శనే కనబరిచిందని, దీంతో ధోనీ ఉన్నా లేకున్నా టీమిండియాకు వచ్చే నష్టమేమీ లేదన్నాడు. ప్రస్తుతం లోకేశ్ యాదవ్, రిషబ్ పంత్ […] The post ధోనీకి చోటు కష్టమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సునీల్ గవాస్కర్

ముంబై: ప్రస్తుత పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి టీమిండియాలో చోటు సంపాదిస్తాడని తాను భావించడ లేదని భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాలంలో దోనీ లేకున్నా టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఒక్క న్యూజిలాండ్ సిరీస్‌లో తప్ప భారత్ మెరుగైన ప్రదర్శనే కనబరిచిందని, దీంతో ధోనీ ఉన్నా లేకున్నా టీమిండియాకు వచ్చే నష్టమేమీ లేదన్నాడు. ప్రస్తుతం లోకేశ్ యాదవ్, రిషబ్ పంత్ వంటి యువ క్రికెటర్లు ధోనీ స్థానాన్ని భర్తీ చేశారని వారిని తొలగించే పరిస్థితి కనిపించడం లేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధోనీకి టీమిండియాలో చోటు దాదాపు అసాధ్యమేనని గవాస్కర్ స్పష్టం చేశాడు. ఇక, కరోనా వ్యాధి విజృంభిస్తున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా పలు క్రీడలు వాయిదా పడడం బాధించి అంశమేనన్నాడు. అయితే ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, కొన్ని క్రీడలను రద్దు చేసినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదన్నాడు.

Dhoni place is hard in team india

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ధోనీకి చోటు కష్టమే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: