బ్లాక్‌స్టోన్ నిధుల కోసం డిహెచ్‌ఎఫ్‌ఎల్ చూపు

  న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిణామాలను ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలలో డిహెచ్‌ఎఫ్‌ఎల్ రు. 125 కోట్లు బాండ్ల చెల్లింపులను చేయాల్సి ఉండగా, ఇది చెల్లిస్తే దేశీయ రుణ మార్కెట్‌లో సెంటిమెంట్ మరింత దిగజారకుండా నివారించేందుకు దోహదపడుతుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దివాన్ హౌసింగ్ ఇప్పటికే రూ.960 కోట్ల రుణాల వడ్డీలను చెల్లింపులను చేయలేకపోయిందని, మంగళవారం బాండ్లకు చెల్లించాల్సి ఉందని అధికారి తెలిపారు. వచ్చే ఏడు రోజుల్లో వాటి ని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. గతంలో […] The post బ్లాక్‌స్టోన్ నిధుల కోసం డిహెచ్‌ఎఫ్‌ఎల్ చూపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ పరిణామాలను ఇన్వెస్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలలో డిహెచ్‌ఎఫ్‌ఎల్ రు. 125 కోట్లు బాండ్ల చెల్లింపులను చేయాల్సి ఉండగా, ఇది చెల్లిస్తే దేశీయ రుణ మార్కెట్‌లో సెంటిమెంట్ మరింత దిగజారకుండా నివారించేందుకు దోహదపడుతుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దివాన్ హౌసింగ్ ఇప్పటికే రూ.960 కోట్ల రుణాల వడ్డీలను చెల్లింపులను చేయలేకపోయిందని, మంగళవారం బాండ్లకు చెల్లించాల్సి ఉందని అధికారి తెలిపారు. వచ్చే ఏడు రోజుల్లో వాటి ని పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. గతంలో గ్రూప్ యూనిట్ విక్రయంలో భాగంగా సోమవారం బ్లాక్‌స్టోన్ గ్రూప్ నుంచి మనీ అందవచ్చని డిహెచ్‌ఎఫ్‌ఎల్ భావిస్తోంది.

లిక్విడిటీ సమస్యలతో ఇటీవల కొంత కాలంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ షేరు పతనబాటలో సాగుతూ వస్తోంది. ఎన్‌ఎస్‌ఇలో 11శాతం నష్టపోయి రూ.87కు చేరింది. మార్చి 29న దివాన్ హౌసింగ్ షేరు ధర రూ. 150 సమీపంలో ట్రేడయ్యింది. అప్పటి నుంచి క్షిణిస్తూ జూన్ 6 నాటికి రూ.93కు చేరింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారులుగా ఉన్న ఏస్ ఈక్విటీ, ఎల్‌ఐసి అతిపెద్ద వాటాదారులుగా నిలుస్తున్నారు.

కొంత కాలంగా లిక్విడిటీ సమస్యలతో పతన బాటలో సాగుతు న్న ఎన్‌బిఎఫ్‌సి షేరు డిహెచ్‌ఎఫ్‌ఎల్ అటు ఇన్వెస్టర్లకు, ఇటు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకూ నష్టాలను మిగిల్చింది. కంపెనీలో ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా సంస్థ ఏస్ ఈక్విటీ, మరో ప్రభు త్వం బీమా సంసంస్థ ఎల్‌ఐసిలు అతిపెద్ద వాటాదారులుగా ఉన్నారు. రోజురోజుకీ వీరి పెట్టుబడులు కరిగిపోతున్నాయి. ఇప్పటికే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ సంక్షోభం కారణం గా పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు పెట్టుబడుల విషయంలో దెబ్బతిన్నాయి.

DHFL shares plumb fresh 52 week lows

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బ్లాక్‌స్టోన్ నిధుల కోసం డిహెచ్‌ఎఫ్‌ఎల్ చూపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: