భారత్ అదరహో

ధావన్ శతకం, రాణించిన కోహ్లి, రోహిత్ స్మిత్, కారె పోరాటం వృథా ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం లండన్: ప్రపంచకప్‌లో కోహ్లి సేన వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది. శిఖర్ ధావన్ (117) శతకానికి విరాట్ కోహ్లి […] The post భారత్ అదరహో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ధావన్ శతకం, రాణించిన కోహ్లి, రోహిత్
స్మిత్, కారె పోరాటం వృథా
ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

లండన్: ప్రపంచకప్‌లో కోహ్లి సేన వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది. శిఖర్ ధావన్ (117) శతకానికి విరాట్ కోహ్లి (52), రోహిత్ శర్మ (57)ల అర్ధ సెంచరీలు తోడు కావడంతో టీమిండియా భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉం చింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఆస్ట్రేలి యా 50 ఓవర్లలో 316 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా లక్ష్యానికి సమీపంలోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్‌లు శుభారంభం అందించారు.

ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొం టూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ప్రారంభం లో భారీ షాట్ల జోలికి వెళ్లకుండా సమన్వయంతో ఆడారు. భారత స్పీడ్‌స్టర్లు భువనేశ్వర్, బుమ్రాలు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేయడంతో ఆసీస్ స్కోరు ఆశించిన స్థాయిలో పరిగెత్తలేక పోయింది. కానీ, కుదురుకున్న తర్వాత ఫించ్ బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించాడు. ధా టిగా ఆడిన ఫించ్ 35 బంతుల్లో మూడు ఫోర్లు, సి క్స్‌తో 38 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో 61 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్ మరో కీలక భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

సమన్వయంతో ఆడిన వార్నర్ ఐదు ఫోర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ ఐ దు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఉస్మాన్ ఖ్వాజా 42 పరుగు లు చేసి వెనుదిరిగాడు. చివర్లో అలెక్స్ కారె మెరుపులు మెరిపించాడు. అయితే మిగతావారు వి ఫలం కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. ధాటిగా ఆడిన కారె 35 బంతుల్లోనే ఐదు ఫోర్లు, సిక్స్‌తో అజేయంగా 55 పరుగులు చేశాడు. భా రత బౌలర్లలో బుమ్రా, భువనేశ్వర్ మూడేసి వికె ట్లు తీశారు. చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ధావన్ ధనాధన్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు శుభారంభం అందించారు. ప్రారంభం నుంచే ఇద్దరు జాగ్రత్తగా ఆడారు. ఆరంభంలో భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆత్మరక్షణతో బ్యాటింగ్ చేశారు. కుదురుకున్న తర్వాత బ్యాట్‌ను ఝులిపించడం ప్రారంభించారు. ఇటు రోహిత్, అటు ధావన్‌లు జోరును పెంచడంతో స్కోరు వేగాన్ని అందుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ మూడు ఫోర్లు, సిక్స్‌తో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక, అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన శిఖర్ ధావన్ 109 బంతుల్లోనే 16 బౌండరీలతో 117 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 77 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన హార్దిక్ పాండ్య 4 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 48 పరుగులు సాధించాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోని మూ డు ఫోర్లు, సిక్స్‌తో 27 పరుగులు చేశాడు. దీంతో భారత్ స్కోరు 352 పరుగులకు చేరింది.

స్కోరుబోర్డు:
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) అలెక్స్ కారె (బి) కౌల్టర్ నైల్ 51, శిఖర్ ధావన్ (సి) లియాన్ (బి) మిఛెల్ స్టార్క్ 117, విరాట్ కోహ్లి (సి) కమిన్స్ (బి) స్టోయినిస్ 82, హార్దిక్ పాండ్య (సి) ఫించ్ (బి) కమిన్స్ 48, మహేంద్ర సింగ్ ధోని (సి) అండ్ (బి) స్టోయినిస్ 27, లోకేశ్ రాహుల్ నాటౌట్ 11, కేదార్ జాదవ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం 50 ఓవర్లలో 352/5.
బౌలింగ్: పాట్ కమిన్స్ 100551, మిఛెల్ స్టార్క్ 100741, కౌల్టర్‌నైల్ 101631, మాక్స్‌వెల్ 70450, ఆడమ్ జంపా 60500, స్టోయినిస్ 70622.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) భువనేశ్వర్ (బి) చాహల్ 56, అరోన్ ఫించ్ రనౌట్ 36, స్టీవ్ స్మిత్ ఎల్బీబి భువనేశ్వర్ కుమార్ 69, ఉస్మాన్ ఖ్వాజా (బి) బుమ్రా 42, మాక్స్‌వెల్ (సి) జడేజా (బి) చాహల్ 28, అలెక్స్ కారె నాటౌట్ 55, కౌల్టర్‌నైల్ (సి) కోహ్లి (బి) బుమ్రా 4, కమిన్స్ (సి) ధోని (బి) బుమ్రా 8, స్టార్క్ రనౌట్ 3, ఆడమ్ జంపా (సి) జడేజా (బి) భువనేశ్వర్ 1, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం 50 ఓవర్లలో 316 ఆలౌట్.
బౌలింగ్: భువనేశ్వర్ 100503, జస్‌ప్రిత్ బుమ్రా 101633, హార్దిక్ పాండ్య 100680, కుల్దీప్ యాదవ్ 90550, చాహల్ 100622, కేదార్ జాదవ్ 10140.

Dhawan elated after India clinical win over Australia

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్ అదరహో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: