గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు : డిజిపి

  హైదరాబాద్: గురువారం జరిగే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు  తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయని, అందుకోసం 50 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్టు డిజిపి తెలియజేశారు. ప్రతి చోట సిసికెమెరాలతో నిఘా […] The post గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు : డిజిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: గురువారం జరిగే గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు  తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయని, అందుకోసం 50 చోట్ల నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్టు డిజిపి తెలియజేశారు. ప్రతి చోట సిసికెమెరాలతో నిఘా ఉంటుందని, దీంతో ప్రతీ పోలీసు స్టేషన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా నిమజ్జనం సందర్భంగా సెలవు దినం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలు, మేడ్చల్, మల్కాజ్ గిరి జిల్లాలకు ఈ ఉత్తర్వులు వర్తింస్తాయి.

DGP speech on All arrangements for Ganesh immersion

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు : డిజిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: