లిస్బన్‌క్లబ్ ఘటనపై డిజిపి సీరియస్

 DGP Mahender Reddy

మనతెలంగాణ/హైదరాబాద్ ః నగరంలోని లిస్బన్‌క్లబ్ ఘటనపై డిజిపి మహేందర్‌రెడ్డి సీరియస్ అయ్యారు. బాధితురాలు క్లబ్ డ్యాన్సర్ హరిణిపై దాడి జరుగుతున్న క్రమంలో ఆమోఎ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పోలీసులు బాధితురాలికి ఏమాత్రం సహాయం చేయకుండా దాడికి పాల్పడిన వారికి వత్తాసుపలి కారని అరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పంజాగుట్ట ఎసిపి తిరుపతన్నకు డిజిపి ఆదేశాలిచ్చారు. లిస్బన్‌క్లబ్ డ్యాన్సర్ హరిణి అనే యువతిని అసాంఘీక కార్యకలాపాలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం, అందుకు ఆ యువతి అంగీకరించకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని డిజిపి కిందిస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఘటనపై సకాలంలో విచారణ జరిపి పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులను ఆదేశించడంతో బాధితురాలి ఆరోపణలపై మరోసారి విచారణ చేపట్టనున్నారు. డయల్ 100 పోలీసులపై ఆరోపణలు రుజువైతే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు వివరిస్తున్నారు.

కాగా పబ్‌కు వచ్చే వారి ఇష్టానుసారం ప్రవర్తించాలని, కస్టమర్ల కోరిన విధంగా సహకరించాలని పబ్ యజమానులు, తోటి డ్యాన్సర్లు హరిణిని వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయినప్పటికీ హరిణి తన పద్దతి మార్చుకోకపోవడంతో తోటి డ్యాన్సర్లు, పబ్ నిర్వహకులు ఆమెపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో హరిణి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆమెను వివస్త్రను చేసి తోటి డ్యాన్సర్లు సింథిల్ మధు, విజయారెడ్డి, ప్రీతి, స్వీటిలతో పాటు సయీద్ తదితరులు బీరు సీసాలు, బ్లేడ్‌లతో తీవ్రంగా గాయపరిచి బంధించారని పోలీసుల విచారణ వెలుగుచూసింది. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు హరిణి డయల్ 100 కాల్ చేసి పోలీసులకు వివరించింది. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హరిణిని కాపాడకుండా పబ్ యాజమానులకు సహకరించారని బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి డయల్ 100 పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిజిపి ఆదేశించారు.

దీంతో బాధితురాలు హరిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింథిల్ మధు, విజయారెడ్డి, ప్రీతి, స్వీటి అనే నలుగురు యువతులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సయీద్ పరారీలో ఉన్నాడని, అనతికాలంలో అతన్ని పట్టుకుంటామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

 DGP Mahender Reddy Serious on Lisbon Pub Dancer Case

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లిస్బన్‌క్లబ్ ఘటనపై డిజిపి సీరియస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.