ఐదు నిమిషాలు ఇలా చేస్తే ఒత్తిడి మాయం

Overcome office tension

* గుండె నిండా గాలిని పీల్చి, పది లెక్కపెట్టండి. ఆ తర్వాత నెమ్మదిగా గాలి వదలండి. ఇలా తరచూ చేస్తే ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది.
* మీ ఫీలింగ్స్ అన్నింటిని ఒక కాగితం మీద రాసి తర్వాత ఆ పేపర్ ను చింపేయండి.
* రోజంతా బిజీ షెడ్యూల్ పెట్టుకొని ఏదైన ఇష్టమైన పనిలో నిమగ్నం అయి దృష్టిని మర్చండి.
* కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతంలో 45 సెకన్లు నొక్కిపడితే ఉపశమనం పొందుతారు. దీనిద్వారా కొత్త ఎనర్జీ వచ్చి, రిలాక్స్ అవుతారు.
* గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల కూడా తలనొప్పి, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే అవకాశాలుంటాయి.

ఒత్తిడిని తగ్గించే ఆహారం

* మన శరీరానికి తగ్గట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే  తీసుకోవాల్సివుంటుంది. ఇవి శరీరంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తుంది.
* కమలాపండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది.
* బంగాళా దుంపలో విటమిన్ బి గ్రూపునకు చెందిన విటమిన్లుంటాయి. ఇది ఒత్తిడిని దూరం చేయడంలో భేషుగ్గా పనిచేస్తుంది.
* బియ్యం, చేపలు, బీన్స్, ధాన్యాలలో విటమిన్ బి అధికంగా ఉంటుంది. మెదడుకు సంబంధించిన జబ్బులను నివారించేందుకు ఇవి తోడ్పడతాయి. మానసికపరమైన ఒత్తిడిని తగ్గిస్తాయి.
* ఆకు కూరలు, గోధుమలు, సోయాబీన్, వేరుశెనగ గింజలు, మామిడి పండు, అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఒత్తిడిని పటాపంచలు చేస్తాయి.

 

Depression Treatment in Telugu

 

Depression Treatment with Air

మల్లీశ్వరి వారణాసి 

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఐదు నిమిషాలు ఇలా చేస్తే ఒత్తిడి మాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.