విదేశాలకు వెళ్లాలంటే రూ.18 వేల కోట్లు డిపాజిట్ చేయండి…

  నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం కోర్టు గోయల్ దేశం విడిచివెళ్లేందుకు వీలులేదని చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు కోర్టు అనుమతి నిరాకరిస్తూ.. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే రూ.18,000 కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని కోరింది. ఆయన మీద జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్‌ఒసి)ను సవాలు […] The post విదేశాలకు వెళ్లాలంటే రూ.18 వేల కోట్లు డిపాజిట్ చేయండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నరేష్ గోయల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌కు
ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం కోర్టు గోయల్ దేశం విడిచివెళ్లేందుకు వీలులేదని చెప్పింది. విదేశాలకు వెళ్లేందుకు ఆయనకు కోర్టు అనుమతి నిరాకరిస్తూ.. ఒకవేళ దేశం విడిచి వెళ్లాలంటే రూ.18,000 కోట్లను హామీ కింద డిపాజిట్ చేయాలని కోరింది.

ఆయన మీద జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్‌ఒసి)ను సవాలు చేస్తూ గోయల్ చేసిన అభ్యర్థనపై కేంద్రం సమాధానం ఇవ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తాత్కాలిక ఊరట కల్పించలేమని గోయల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి సురేశ్ కెయిత్ తెలిపారు.

మే 25న గోయల్ దుబాయ్‌కు వెళుతుండగా విమానం నుంచి దింపివేసిన విషయం తెలిసిందే. గోయల్‌పై ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. విమానం నుంచి దింపివేసిన తరవాతే తన మీద జారీ అయిన ఎల్‌ఒసి గురించి తెలిసిందని గోయల్ వెల్లడించారు. తనపై జారీ చేసిన ఎల్‌ఒసిని సవాలు చేస్తూ గోయల్ కోర్టును ఆశ్రయించగా, తాజాగా ఈ తీర్పు వెలువడింది.

Delhi High Court Orders to Naresh Goyal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విదేశాలకు వెళ్లాలంటే రూ.18 వేల కోట్లు డిపాజిట్ చేయండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.