అభినందన్ వర్థమాన్‌కు వీర్‌చక్ర

  మిలిటరీ అవార్డులు ప్రకటించిన రక్షణశాఖ బాలాకోట్ వీర పైలట్లు ఐదుగురికి పురస్కారాలు న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఫిబ్రవరిలో జరిగిన ఆకాశయుద్ధంలో ఆ దేశ జెట్ విమానాన్ని కూల్చి అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మూడవ అత్యున్నత శౌర్య పతకం వీర్‌చక్రను ప్రకటించింది. పాక్ సైన్యానికి బందీగా పట్టుబడి, అక్కడ మూడు రోజులు ఎన్నో కష్టాల్ని భరించినా చివరికి మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు అభినందన్. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భం […] The post అభినందన్ వర్థమాన్‌కు వీర్‌చక్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మిలిటరీ అవార్డులు ప్రకటించిన రక్షణశాఖ
బాలాకోట్ వీర పైలట్లు ఐదుగురికి పురస్కారాలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఫిబ్రవరిలో జరిగిన ఆకాశయుద్ధంలో ఆ దేశ జెట్ విమానాన్ని కూల్చి అసమాన ధైర్య సాహసాల్ని ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌కు కేంద్ర ప్రభుత్వం భారతదేశపు మూడవ అత్యున్నత శౌర్య పతకం వీర్‌చక్రను ప్రకటించింది. పాక్ సైన్యానికి బందీగా పట్టుబడి, అక్కడ మూడు రోజులు ఎన్నో కష్టాల్ని భరించినా చివరికి మొక్కవోని ధైర్యం ప్రదర్శించారు అభినందన్. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భం గా రక్షణ మంత్రిత్వశాఖ బుధవారం మిలిటరీ అవార్డు ల్ని ప్రకటించింది. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన సప్పర్ ప్రకాష్‌జాధవ్‌కు మరణానంతరం కీర్తిచక్ర అవార్డు లభించింది. ఫిబ్రవరి 27న భారత్‌పాక్‌ల మధ్య జరిగిన వైమానిక దాడిలో ఫ్లైట్ కంట్రోలర్‌గా కీలకపాత్ర పోషించిన స్కాడ్రన్ లీడర్ మింటీ అగర్వాల్‌కు యుద్ధ్ సేవా మెడల్ ను ప్రకటించారు.

ఫిబ్రవరి 27న పాకిస్థాన్‌లో బాలకోట్ లో బాంబులు వేసి జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన అయిదుగురు మిరాజ్ 2000 ఫైటర్ పైలట్ల శౌర్య పరాక్రమాలకు గుర్తింపుగా వారిని వాయుసేన అవార్డులకు ఎంపిక చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వింగ్ కమాండర్ అమిత్ రంజన్, స్కాడ్రన్ లీడర్లు రాహుల్ బసోయా, పంకజ్ భుజడే, శశాంక్ సింగ్, బికెఎన్ రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

 

Defense Department of India announces Military Awards 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అభినందన్ వర్థమాన్‌కు వీర్‌చక్ర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: