రోడ్డు ప్రమాదంలో కృష్ణజింక మృతి

Deer Killed in Road Accident at Utkur

మహబూబ్‌నగర్ : ఉట్కూర్ మండలం మల్లెపల్లి – కొల్లూరు గ్రామాల మధ్య సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై వెళుతున్న కృష్ణజింక మృతి చెందింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు సంఘటనాస్థలిని సందర్శించారు. కృష్ణజింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Deer Killed in Road Accident at Utkur

Comments

comments