వెస్టిండిస్‌ బాహుబలిని ఆటపట్టించిన టీమిండియా క్రికెటర్

  ముంబయి : వెస్టిండీస్‌-ఏతో జరిగిన వన్డేలో రకీమ్‌ కార్న్‌వాల్‌ను దీపక్‌ చాహర్‌ ఆటపట్టించాడు. 140 కిలోల భారీకాయంతో అతడు క్రికెట్‌ ఆడుతుండటం ప్రత్యేకం. కోహ్లీసేనతో జరిగే తొలి టెస్టులో వెస్టిండిస్‌ బాహుబలి అరంగేట్రం చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రికార్డులు బద్దలు చేస్తున్న అతడిని క్రిస్‌గేల్‌ను కాదని మరీ చోటిచ్చింది. విండీస్‌ ఆటగాడు ఒకరు ఔటైనప్పుడు కార్న్‌వాల్‌ తన భారీకాయంతో మైదానంలో గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు. ఫీల్డర్‌ దీపక్‌ చాహర్‌ సైతం అతడి నడకను అనుసరించి […] The post వెస్టిండిస్‌ బాహుబలిని ఆటపట్టించిన టీమిండియా క్రికెటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి : వెస్టిండీస్‌-ఏతో జరిగిన వన్డేలో రకీమ్‌ కార్న్‌వాల్‌ను దీపక్‌ చాహర్‌ ఆటపట్టించాడు. 140 కిలోల భారీకాయంతో అతడు క్రికెట్‌ ఆడుతుండటం ప్రత్యేకం. కోహ్లీసేనతో జరిగే తొలి టెస్టులో వెస్టిండిస్‌ బాహుబలి అరంగేట్రం చేస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రికార్డులు బద్దలు చేస్తున్న అతడిని క్రిస్‌గేల్‌ను కాదని మరీ చోటిచ్చింది. విండీస్‌ ఆటగాడు ఒకరు ఔటైనప్పుడు కార్న్‌వాల్‌ తన భారీకాయంతో మైదానంలో గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు.

ఫీల్డర్‌ దీపక్‌ చాహర్‌ సైతం అతడి నడకను అనుసరించి ఎదురుగా వెళ్లాడు. దాదాపు ఢీకొనే ముందు పక్కకు వెళ్లిపోయాడు. ఐతే కార్న్‌వాల్‌ ఎలాంటి ప్రతిస్పందన కనబరచకపోవడం గమనార్హం. అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడితే ఆస్ట్రేలియా వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తర్వాత అత్యంత భారీకాయుడిగా రికార్డు సృష్టిస్తాడు. అతడు క్రీజులో నిలిస్తే విధ్వంసం మామూలుగా ఉండదు. బంతిని కసితో బాదేస్తాడు.

Deepak Chahar Teased Rakim Cornwall in odi match

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వెస్టిండిస్‌ బాహుబలిని ఆటపట్టించిన టీమిండియా క్రికెటర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: