కుచించుకుపోతున్న చంద్రుడు

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం  పెరగడం తదితర  కారణాల వల్ల కుచించుకుపోతుందని  అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిణామం  కొన్ని వందల మిలియన్ల ఏళ్ల నుంచి కొనసాగుతోందని వారు చెప్పారు.  ఇప్పటివరకు చంద్రుడు 150 అడుగుల (50మీటర్ల) కంటే ఎక్కువగా కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ ప్రొఫెసర్‌ నికోలస్‌ తేల్చి చెప్పారు.  ఉపరితలం కుచించుకుపోవడంతో పాటు చంద్రడిపై ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని వారు […] The post కుచించుకుపోతున్న చంద్రుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. చంద్రుడిపై అంతర్గతంగా ఉన్న చల్లదనం  పెరగడం తదితర  కారణాల వల్ల కుచించుకుపోతుందని  అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిణామం  కొన్ని వందల మిలియన్ల ఏళ్ల నుంచి కొనసాగుతోందని వారు చెప్పారు.  ఇప్పటివరకు చంద్రుడు 150 అడుగుల (50మీటర్ల) కంటే ఎక్కువగా కుచించుకుపోయినట్లు తమ అధ్యయనంలో తేలిందని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ ప్రొఫెసర్‌ నికోలస్‌ తేల్చి చెప్పారు.  ఉపరితలం కుచించుకుపోవడంతో పాటు చంద్రడిపై ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని వారు వెల్లడించారు.   నాసాకు చెందిన లూనార్‌ రీకానిసెన్స్‌ ఆర్బిటార్‌ తీసిన 12 వేల చంద్రుడి చిత్రాలను శాస్త్రవేత్తలు విశ్లేషించి ఈ విషయాన్ని ధృవీకరించారు. చంద్రుడి ఉత్తర ధృవానికి సమీపంలోని మెరే ఫ్రిగోరిస్‌ వద్ద కుచించుకుపోయిందని తెెలిపారు. దీని వల్ల చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉందని వారు చెప్పారు. భూమికి టెక్టోనిక్‌ ప్లేట్లు ఉన్నాయి. కానీ చంద్రుడికి లేవు. దీంతో చంద్రుడు ఏర్పడిన 4.5 బిలియన్‌ సంవత్సరాల నుంచి దాని లోపల వేడి నెమ్మదిగా కోల్పోతుందని, ఫలితంగా టెక్నోటిక్‌ ప్రక్రియ మొదలైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  చంద్రుడు కుచించుకుపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుందని వారు తెలిపారు. చంద్రుడు కుచించుకుపోవడంపై  నేచర్‌ జియోసైన్స్‌ జర్నల్‌లో ప్రత్యేక కథనం వచ్చింది. దీంతో చంద్రుడు కుచించికుపోవడంపై విశ్వ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Decreasing The Moon Size

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కుచించుకుపోతున్న చంద్రుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: