ఉత్తర కొరియాలో నలుగురు అధికారులకు మరణ శిక్ష

ఉత్తరకొరియా : ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అనుకున్న సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కిమ్ ఐదుగురు సీనియర్ అధికారులకు మరణ శిక్ష విధించారు. ఈ శిక్షను ఇటీవల అమలు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా దినపత్రిక చోసున్ వెల్లడించింది. ట్రంప్ తో కిమ్ భేటీ నేపథ్యంలో అమెరికాకు ప్రత్యేక బృందంగా వెళ్లి వచ్చిన ఐదుగురు […] The post ఉత్తర కొరియాలో నలుగురు అధికారులకు మరణ శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఉత్తరకొరియా : ఇటీవల ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అనుకున్న సత్ఫలితాలను ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కిమ్ ఐదుగురు సీనియర్ అధికారులకు మరణ శిక్ష విధించారు. ఈ శిక్షను ఇటీవల అమలు చేశారు. ఈ విషయాన్ని దక్షిణ కొరియా దినపత్రిక చోసున్ వెల్లడించింది. ట్రంప్ తో కిమ్ భేటీ నేపథ్యంలో అమెరికాకు ప్రత్యేక బృందంగా వెళ్లి వచ్చిన ఐదుగురు అధికారులకు కిమ్ మరణ శిక్ష అమలు చేశారని ఆ పత్రిక పేర్కొంది. కిమ్ తో పాటు రైల్లో వెళ్లి ట్రంప్ తో భేటీలో అన్నీ తానై కిమ్ హయోక్ చౌల్ వ్యవహరించారు. ఈ క్రమంలో అధినేత కిమ్ ను  మోసం చేశారని, ఈ క్రమంలో కిమ్ ఆదేశాలతో హయోక్ చౌల్ తలలో తుపాకీతో కాల్చి చంపారని పత్రిక పేర్కొంది. మిరిమ్ ఎయిర్ పోర్టులో హయోక్ చౌల్ తో పాటు మరో నలుగురు దౌత్యాధికారులను కూడా కాల్చి చంపారు. అయితే హయోక్ చౌల్ పేరు తప్ప మిగిలిన నలుగురు అధికారుల పేర్లను మాత్రం ఆ పత్రిక వెల్లడించలేదు. ట్రంప్ తో కిమ్ భేటీ సందర్భంగా చిన్న తప్పు జరిగిందన్న ఆరోపణలతో కిమ్ అనువాదకురాలు షిన్ హోయ్ యంగ్ కు జైలు శిక్ష విధించారు. కిమ్ కొత్త ప్రతిపాదనను ట్రంప్ కు ఆంగ్లంలో తర్జుమా చేసి చెప్పడంలో ఒక్క పదాన్ని తప్పుగా పలకడమే ఆమె చేసిన నేరమైంది. దీంతో కిమ్ ఆమెను జైలుకు పంపించాడు.

Death Sentenced To Four Executives In North Korea

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఉత్తర కొరియాలో నలుగురు అధికారులకు మరణ శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: