విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి

Death of young man with electric shock in mahabubnagar

మహబూబ్ నగర్: మండల పరిధిలోని ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన పాపన్నపేట పోలీసు స్టేషన్ లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిట్యాల గ్రామానికి చెందిన బైరి శివకుమార్(21) తండ్రి దుర్గయ్య శనివారం తన పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్టు పాపన్నపేట ఎస్ఐ సందీప్‌రెడ్డి తెలిపారు.