రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

Death of a young man in road accident
కొల్చారం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన కొల్చారం మండలం చిన్నఘనపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన శ్రీనివాస చారి(21) వృత్తి రిత్యా మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తూ తమ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఏడుపాయల సమీపంలో పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లి బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణంలో సంగారెడ్డి- మెదక్ ప్రధాన రహదారి మూల మలుపు వద్ద అదుపు తప్పి బండరాయిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు కొల్చారం ఎఎస్ఐ తెలిపారు. మృతునికి తండ్రి లక్ష్మినారాయణ, తల్లి లక్ష్మి ఉన్నట్లు, పెద్ద కూతురు వివాహం కాగా తమను పోషించే ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామలో శ్రీనివాస చారి మృతి చెందడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. మృత్యుని తండ్రి ఫిర్యాదు మేరకు కొల్చారం ఎఎస్ఐ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.