పెంబి: విద్యుత్‌షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన పెంబి మండలంలోని మందపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపినన వివరాల ప్రకారం… మందపెల్లి గ్రామానికి చెందిన ఎర్ర సాయన్న(50) అనే రైతు మొక్కజొన్న తోటకు నీరు పెట్టడానికి వెళ్లగా అక్కడ గాలి దూమారంతో మోటర్స్టాటర్ తీగలు కింద పడి ఉండగా వాటిని సరి చేయబోయి ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు తెలిపారు. మృత్యుడికి భార్య మల్లవ్వతో పాటు కొడుకు, కూతురు ఉన్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ఐ సంజీవ్‌కుమార్ కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.