అభిమానులంతా కామ్రేడ్సే : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “నాలుగు భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. అలాగే ఈనెల 26న […] The post అభిమానులంతా కామ్రేడ్సే : విజయ్ దేవరకొండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “నాలుగు భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. అలాగే ఈనెల 26న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించబోతున్నాం.

ఈనెల 12న బెంగుళూర్‌లో, 13న కొచ్చిలో, 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఇక మనం ఏ పని చేసినా, కష్టసుఖాల్లో మనకు తోడుగా ఉండే వ్యక్తులను, స్నేహితులను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆడియన్స్ ప్రేమ, అభిమానాలే. వాళ్లంతా కామ్రేడ్సే. అందుకే వారి కోసం మ్యూజిక్ సెలబ్రేషన్ నిర్వహించాలనుకుంటున్నాం. అందరూ ఫ్రీగా ఈ ఈవెంట్స్‌కు రావచ్చు. బెంగుళూర్‌లో జరిగే ఈవెంట్‌కు కన్నడ స్టార్ యశ్ అతిథిగా హాజరు కానున్నారు”అని అన్నారు.

రష్మిక మందన్న మాట్లాడుతూ “ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో నేను లిల్లీ పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు భరత్ ఈ సినిమాతో బిజీ కావడమే కాదు పెద్ద దర్శకుడవుతాడు”అని తెలిపారు. చిత్ర దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ “ఇదొక లాంగ్ జర్నీ. మూడేళ్లుగా దీనిపై వర్క్ చేస్తున్నాం. నాకు పూర్తి సపోర్ట్ చేసిన విజయ్‌కు థాంక్స్‌”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, యశ్ రంగినేని, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Dear Comrade Trailer Review

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అభిమానులంతా కామ్రేడ్సే : విజయ్ దేవరకొండ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: