గడువు దాటితే ఆ కార్డు చెల్లదు

పాన్-ఆధార్ అనుసంధానికి గడువు ఆగస్టు 31 న్యూఢిల్లీ: మీరు పాన్ కార్డులకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేశారా? చేయకపోయినట్లయితే వెంటనే ఈ పనిని పూర్తి చేయండి. సెప్టెంబర్ 1 నాటికి ఈ పనిని పూర్తి చేయకపోతే ఇక మీ పాన్ కార్డు చెల్లదు. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని స్పష్టం చేశారు. […] The post గడువు దాటితే ఆ కార్డు చెల్లదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
పాన్-ఆధార్ అనుసంధానికి గడువు ఆగస్టు 31

న్యూఢిల్లీ: మీరు పాన్ కార్డులకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేశారా? చేయకపోయినట్లయితే వెంటనే ఈ పనిని పూర్తి చేయండి. సెప్టెంబర్ 1 నాటికి ఈ పనిని పూర్తి చేయకపోతే ఇక మీ పాన్ కార్డు చెల్లదు. ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని స్పష్టం చేశారు. అయితే పాన్-ఆధార్ అనుసంధానం మాత్రం యథావిధిగా కొనసాగనుంది.

అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ప్రకటించాయి. ఆదాయపు పన్ను ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్ కార్డుతో అనుసంధానం కాకపోయినట్లయితే ఇకపై కొత్త వర్చువల్ పాన్ నంబర్‌ను కేటాయిస్తారు. ఇకపై అదే పాన్ నంబర్ కానుంది. ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. అలా చేయని పక్షంలో శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్ కార్డులు ఉండగా, 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేశారు. మిగిలిన 18 కోట్ల పాన్ కార్డులు లింక్ చేయాల్సి ఉంది. ఈ రెండింటి అనుసంధానం కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Deadline for the Pan Aadhaar Connection is August 31st

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గడువు దాటితే ఆ కార్డు చెల్లదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: