ఫుట్‌బాల్ దిగ్గజం బెనర్జీ మృతి

  కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనర్జీ తుది శ్వాస విడిచారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ప్రదీప్ చిరస్మరణీయ సేవలు అందించారు. కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుపై తనదైన ముద్రవేశారు. ఆయన పర్యవేక్షణలోనే భారత్ 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. ఇక, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పటిష్టమైన ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించడంలో బెనర్జీ కీలక పాత్ర […] The post ఫుట్‌బాల్ దిగ్గజం బెనర్జీ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ప్రదీప్ కుమార్ బెనర్జీ (83) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనర్జీ తుది శ్వాస విడిచారు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ప్రదీప్ చిరస్మరణీయ సేవలు అందించారు. కెప్టెన్‌గా, ఆటగాడిగా జట్టుపై తనదైన ముద్రవేశారు. ఆయన పర్యవేక్షణలోనే భారత్ 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించింది. ఇక, 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పటిష్టమైన ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ డ్రాగా ముగించడంలో బెనర్జీ కీలక పాత్ర పోషించారు. బెనర్జీ సాధించిన ఏకైక గోల్‌తో భారత్ ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఇక, బెనర్జీ 84 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇదే క్రమంలో 65 గోల్స్ కూడా సాధించారు. కెప్టెన్‌గా విజయవంతమైన బెనర్జీ ఆ తర్వాత భారత జట్టు కోచ్‌గా కూడా తనదైన ముద్ర వేశారు. కోచ్‌గా భారత్‌ను బలమైన జట్టుగా తీర్చిదిద్దారు.

ప్రముఖుల సంతాపం
మరోవైపు బెనర్జీ మృతిపై యావత్ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. బెనర్జీ మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు క్రీడా ప్రముఖులు బెనర్జీ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత క్రీడా రంగానికి తీరని లోటని అభివర్ణించారు. ఇక, క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ కూడా ఫుట్‌బాల్ దిగ్గజం బెనర్జీ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. తాను ఎంతో ఆరాధించే బెనర్జీ మృతి చెందడం ఎంతో బాధకు గురిచేసిందన్నాడు.

 

Dead of Football legend Banerjee

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫుట్‌బాల్ దిగ్గజం బెనర్జీ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: