మారుతీరావు షెడ్డులో దొరికిన మృతదేహం…

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం తీవ్ర కలకలంగా మారింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పదిరోజుల క్రితమే అతను చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముఖం పాడైపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అన్నది గుర్తించడం కష్టంగా మారింది. మృతుడు నీలిరంగు చోక్క, జీన్స్ వేసుకున్నాడు. మృతదేహంపై ఆయిల్ పోసి ఉందని పోలీసులు చెబుతున్నారు. మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్ పల్లి ప్రధాన రాహదారి పక్కన ఉన్న మారుతీరావు షెడ్డులో నుంచి […] The post మారుతీరావు షెడ్డులో దొరికిన మృతదేహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మిర్యాలగూడ: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని మృతదేహం లభించడం తీవ్ర కలకలంగా మారింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. పదిరోజుల క్రితమే అతను చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ముఖం పాడైపోవడంతో ఆ వ్యక్తి ఎవరు అన్నది గుర్తించడం కష్టంగా మారింది. మృతుడు నీలిరంగు చోక్క, జీన్స్ వేసుకున్నాడు. మృతదేహంపై ఆయిల్ పోసి ఉందని పోలీసులు చెబుతున్నారు. మిర్యాలగూడలోని అద్దంకి-నార్కట్ పల్లి ప్రధాన రాహదారి పక్కన ఉన్న మారుతీరావు షెడ్డులో నుంచి దుర్వాసన వస్తుండంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి వచ్చి పరిశీలిస్తున్న పోలీసులకు డెడ్ బాడీ కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఎక్కడైన హత్యచేసి మృతదేహన్ని తీసుకొచ్చి షెడ్డులో పడేశారా? లేదాముందస్తు పథకం ప్రకారమే ఇక్కడికి తీసుకువచ్చి హత్యచేశారా? అనే కోణాల్లో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడి వయస్సు 35 నుంచి 40ఏళ్ల వరకు ఉండవచ్చునని భావిస్తున్నారు. పదేళ్ల నుండి ఖాళీగా ఉన్న మారుతీరావు షెడ్డులో మృతదేహం లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

dead body found maruthi rao shed at miryalaguda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మారుతీరావు షెడ్డులో దొరికిన మృతదేహం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: