సర్వమంగళకారిణి మహాలక్ష్మీ

  లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం; శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం, త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. […] The post సర్వమంగళకారిణి మహాలక్ష్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం;
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం,
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

రెండు చేతులలో మాలలను ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ. డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి. మహాలక్ష్మీని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి.

అమ్మవారి నైవేద్యం

పూర్ణాలు

కావాల్సినవి : కప్పు మినపప్పు, రెండు కప్పుల బియం, కప్పు శనగపప్పు, ఉప్పు, కప్పు తురిమిన బెల్లం, చక్కర, వంట సొడ, నూనె, రెండు టీస్పూన్ల నెయ్యి.
తయారీ విధానం : మినపప్పు, బియ్యం ఒకసారి కడిగి ఆరు గంటలపాటు నానబెట్టుకోవాలి. శనగపప్పుని కూడా ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్‌లో వేసి పావు టీ స్పూన్ ఉప్పు, కొన్ని నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికిం చుకోవాలి. పలుకులుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం, మినపప్పుని రుబ్బుకొవాలి.

ఈ మిశ్రమంలో పావు టీ స్పూన్ వంట సొడా, పావు టీ స్పూన్ వంట ఉప్పు, రెండు టీ స్పూన్ల చక్కర కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఉడికించిన శనగపప్పుని కూడా రుబ్బుకొని పక్కనబెట్టుకొవాలి. ఇప్పుడు ఒక బాణలిలో తురుమిన బెల్లం కొన్ని నీళ్లు బెల్లం కరిగేట్టుగా పోసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు రుబ్బిన పప్పు కూడా అందులోకి కలుపుకొని పావు టీ స్పూన్ యాలకుల పొడి, రెండు టీస్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దగ్గరగా అయిన మిశ్రమాన్ని మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని పిండిలో కలిపి డీ ఫ్రై చేసుకొని తీసేయాలి. వేడి వేడిగా పూర్ణాలు రెడీ.

Ddasara festival celebration in telugu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సర్వమంగళకారిణి మహాలక్ష్మీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: