మన వ్యాక్సిన్ వస్తోంది!

DCGI sanction for Bharat Biotech Covoxin

 

హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్‌కు డిసిజిఐ అనుమతి
వచ్చే నెలలో మానవులపై ప్రయోగాలు, ఐసిఎంఆర్, ఎన్‌ఐవి సహకారంతో వ్యాక్సిన్ తయారీ
కోవిడ్ నియంత్రణకు తయారవుతున్న తొలి స్వదేశీ వ్యాక్సిన్ చరిత్రాత్మకం అవుతుంది : భారత్ బయోటెక్ ఎండి డా. కృష్ణా ఎల్లా

న్యూఢిల్లీ: భారతదేశపు తొట్టతొలి కోవిడ్ మందు కోవ్యాక్సిన్‌కు భారతీయ ఔషధ నియంత్రణ మండలి (డిసిజిఐ) అనుమతి దక్కింది. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (బిబిఐఎల్) సంస్థ దీనిని రూపొందించింది. కరోనా వ్యాక్సిన్ తయారీలో తెలంగాణకు చెందిన ఈ సంస్థ ఇప్పటివరకూ జరిపిన ప్రయోగాలు, జంతువులలో ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వ అధీకృత డిసిజిఐ పరిగణనలోకి తీసుకుంది. ఈ వ్యాక్సిన్ ఫేజ్ 1, 2 స్థాయిల ప్రయోగాలకు అనుమతి వచ్చిందని, ఇవి వచ్చే నెల నుంచే ఆరంభం అవుతాయని భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ఈ కంపెనీకి ఔషధ పరిశోధనా రంగంలో మంచి అనుభవం ఉంది.

పలు వైరస్ సంబంధిత వ్యాధులకు సంబంధించి వ్యాక్సిన్‌ల తయారీలో వీరు ప్రగతి సాధించారు. కరోనా వైరస్ తలెత్తిన దశలోనే దీనికి సంబంధించి మందును కనుగొనే పరిశోధనలకుఅనుమతి కోసం అప్పట్లోనే ఐసిఎంఆర్‌కు కంపెనీ అభ్యర్థన పంపించింది. తరువాతి దశలలో వీరు జరిపిన పరిశోధనలు. ప్రయోగాల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నారు. భారత్ బయోటెక్ వారు ఐసిఎంఆర్, పుణేలోని నేషనల్ ఇనిస్టూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) సహకారంతో ఈ వైరస్ నివారణ మందును రూపొందించినట్లు వెల్లడైంది. ప్రస్తుత వైరస్ స్వరూపాన్ని సమూల రీతిలో విశ్లేషించుకుని ఈ వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు సంస్థ వారు తెలిపారు. ఇకపై జరిగే మనుష్యుల్లో పరీక్షలు విజయవంతం అయితే ఇది సమర్థవంతం అయిన వ్యాక్సిన్ అవుతుందని భావిస్తున్నారు. తమ కీలక దశ ప్రయోగాలు జులైలో ప్రారంభం అవుతాయని దేశవ్యాప్తంగా పలుచోట్ల దీనిని పరీక్షిస్తామని వెల్లడించారు.

ఐసిఎంఆర్‌కు చెందిన ఎన్‌ఐవిలో వర్గీకరణకు గురైన వైరస్ నమూనాలను తమ వ్యాక్సిన్ రూపకల్పన దిశలో ప్రాతిపదికగా తీసుకున్నారు. తమ సంస్థ బిబిఐఎల్‌కు ఐసిఎంఆర్ ఎన్‌ఐవి నుంచి ఇక ముందు కూడా పూర్తి సహకారం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. అంతుచిక్కని మహమ్మారిగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విరుగుడుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా సరైన మందు రాలేదు. ఏదో ఓ దశలో వైరస్ చికిత్స విషయంలో ఇవి విఫలం అవుతూ రావడం, కొన్ని సందర్భాలలో ఇతరత్రా అవలక్షణాలు తలెత్తడంతో ప్రపంచ స్థాయిలో ఇప్పటివరకూ కరోనా మందు స్థానం ఖాళీగానే ఉంది. ఈ దిశలో భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ ఒకటి రెండు అడుగులు ముందుకు వేసిందని విశ్లేషిస్తున్నారు. గిలీడ్ సైసెన్స్ వారి రెమ్‌డెసివిర్ పనితీరు కొంత మెరుగ్గా ఉంది. రోగులకు కొంత ఉపశమనం కల్గించినట్లు వెల్లడైంది. అయితే పూర్తి స్థాయిలో వైరస్ కాటు నుంచి నయం అయినట్లు నిర్థారణ కాలేదు.

DCGI sanction for Bharat Biotech Covoxin

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మన వ్యాక్సిన్ వస్తోంది! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.