కూతురికి ఎస్‌ఐ మరో వివాహ యత్నం?

కోర్టును ఆశ్రయించిన భర్త సెర్చ్ వారెంట్‌తో పరార్   మన తెలంగాణ/ఆదిలాబాద్‌ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఓ ఎస్సై తన కూతురికి రెండో పెళ్లి చేసేందుకు యత్నించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎస్సై కూతురు మేస్రం మాధురి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన మేతుల సంజీవ్ అనే యువకుడిని మార్చి 2018లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. […] The post కూతురికి ఎస్‌ఐ మరో వివాహ యత్నం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోర్టును ఆశ్రయించిన భర్త
సెర్చ్ వారెంట్‌తో పరార్

 

మన తెలంగాణ/ఆదిలాబాద్‌ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పని చేస్తున్న ఓ ఎస్సై తన కూతురికి రెండో పెళ్లి చేసేందుకు యత్నించడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పూర్తి వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఎస్సై కూతురు మేస్రం మాధురి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన మేతుల సంజీవ్ అనే యువకుడిని మార్చి 2018లో హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న సదరు ఎస్సై కూతురిని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో నిర్బంధించి భార్యభర్తలను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న సంజీవ్ తనకు న్యాయం చేయాలని కోరుతూ మేడ్చల్ కోర్ట్‌ను ఆశ్రయించగా న్యాయస్థానం సెర్చ్ వారెంట్‌ను జారీ చేసింది.

ఇందులోభాగంగా ఆదివారం ఓ న్యాయవాదితో కలిసి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులతో కలిసి ఎస్సై నివాసానికి వెళ్లగా అప్పటికే విషయాన్ని తెలుసుకున్న సదరు ఎస్సై తన కూతురు, కాబోయే అల్లుడితో కలిసి పరారయ్యాడు. కాగా సెర్చ్ వారెంట్‌తో వెళ్లిన సంజీవ్‌తో పాటు ఆయన వెంట వెళ్లిన వారిపై దాడి చేసేందుకు యత్నించడం వివాదాస్పదంగా మారింది. వీరు తీసుకెళ్లిన వాహనం అద్దాలను ధ్వంసం చేసి దాడి చేసేందుకు యత్నించడంతో ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇదిలాఉంటే పోలీసు ఉన్నతాధికారులు తన కూతురికి రెండో పెళ్లి చేసేందుకు యత్నిస్తున్న ఎస్సైకు సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎస్సై తన కూతురికి రెండో పెళ్లి చేసేందుకు యత్నించిన విషయం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశం గా మారింది. ఇదిలాఉంటే ఈ విషయంపై వివరణ ఇచ్చే ందుకు పోలీసులు సుముఖత వ్యక్తం చేయడం లేదు.

 

Daughter Marriage to Another Person by SI in Adilabad

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కూతురికి ఎస్‌ఐ మరో వివాహ యత్నం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: