కూతురు బాయ్ ఫ్రెండ్ ను తుపాకీతో కాల్చి….

Daughter boy friend murder by her father at pune

 

పూనే: కూతురి బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేయించిన సంఘటన మహారాష్ట్రలోని పూనేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యశ్వంత్ కాంబ్లే అనే వ్యక్తి బిల్డర్‌గా పని చేసేవాడు. యశ్వంత్ ఒక కూతురు ఉంది. ఆ కూతురుకి అమిత్ మిలింద్ సారోడ్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అమిత్‌- తన కూతురు ప్రేమించుకోవడం అతడికి ఇష్టం లేదు. దీంతో అమిత్‌ను చంపాలని యశ్వంత్ నిర్ణయం తీసుకున్నాడు. అమిత్ డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. ఎప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడని వివరాలను సేకరించి యశ్వంత్ తన ఇద్దరు అనుచరులు అదేశ్ నన్‌వేర్, అయుష్ కలేతో మర్డర్ ప్లాన్ వేశాడు. అమిత్‌పై యశ్వంత్ తుపాకీతో కాల్పులు జరపగానే ఇద్దరు అనుచరులు కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

The post కూతురు బాయ్ ఫ్రెండ్ ను తుపాకీతో కాల్చి…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.