హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు

  సిమ్లా/హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రే య బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైకో ర్టు ప్రధానన్యాయమూర్తి రామసుబ్రమణ్యన్ ఆయ న చేత ప్రమాణం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టోపీ ధరించి దత్తాత్రేయ కార్యమ్రాని కి హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సావాని ముఖ్య టమంత్రి జయరాం సింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం దత్తాత్రేయ కు […] The post హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిమ్లా/హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రే య బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. హైకో ర్టు ప్రధానన్యాయమూర్తి రామసుబ్రమణ్యన్ ఆయ న చేత ప్రమాణం చేయించారు. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టోపీ ధరించి దత్తాత్రేయ కార్యమ్రాని కి హాజరయ్యారు. ప్రమాణస్వీకారోత్సావాని ముఖ్య టమంత్రి జయరాం సింగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

ప్రమాణస్వీకారం అనంతరం దత్తాత్రేయ కు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఇక్కడ గవర్నర్‌గా పనిచేసిన కల్‌రాజ్ మిశ్రా స్థానం లో దత్తాత్రేయను నియమించారు. దత్తాత్రేయ 2014లో నరేంద్రమోడీ సారథ్యంలోని ప్రభుత్వం లో కార్మిక, ఉపాధి శాఖల సహాయమంత్రిగా, అట ల్ బిహారీ వాజ్‌పేయి కేబినెట్‌లో కూడా పనిచేశా రు. పర్వత ప్రాంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌కు దత్తాత్రేయ 7వ గవర్నర్.

బండారు దత్తాత్రేయకు ఘన సన్మానం
దత్తాత్రేయను తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సిమ్లా రాజ్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్‌తో పాటు జాతీయ కార్యవర్గ సభ్యు లు ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రులు అరుణ, పెద్దిరెడ్డి, మాజి ఎంపిలు జితేందర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రరారెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వర్‌రావు, ధర్మారావు, సంకినేని, కాసం వెంటకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులు చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, డా.జి.మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Dattatreya Duties as Governor of Himachal Pradesh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: