ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్

  ఓరుగల్లుకు దక్కిన మరో క్యాబినెట్ హోదా.. హర్షం వ్యక్తం చేస్తున్న వరంగల్ పశ్చిన నియోజవర్గ టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి స్థానంలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినేట్ హోదా కలిగిన పదవి లభించింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ ఎం ఎల్‌ఎలలో ఏడుగురు సీనియర్ ఎంఎల్‌ఎలకు చీఫ్ విప్ పదవికి ఎంపిక చేశారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు చెందిన […] The post ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఓరుగల్లుకు దక్కిన మరో క్యాబినెట్ హోదా..
హర్షం వ్యక్తం చేస్తున్న వరంగల్ పశ్చిన నియోజవర్గ టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు

వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి స్థానంలో ప్రభుత్వ చీఫ్ విప్ క్యాబినేట్ హోదా కలిగిన పదవి లభించింది. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ ఎం ఎల్‌ఎలలో ఏడుగురు సీనియర్ ఎంఎల్‌ఎలకు చీఫ్ విప్ పదవికి ఎంపిక చేశారు. ఏడు ఉమ్మడి జిల్లాలకు చెందిన సీనియర్ ఎంఎల్‌ఎలకు ఈ పదవులు లభించాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి వరంగల్ పశ్చిమ ఎంఎల్‌ఎ దాస్యం వినయ్ భాస్కర్‌కు ఈ పదవి లభించడం పట్ల వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ఉమ్మడి జిల్లా నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఇప్పటికే పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అత్యున్న తమైన మంత్రిత్వ శాఖకు ముఖ్యమంత్రి కెసిఆర్ కట్టబెట్టారు.

క్యాబినేట్ స్థాయి కలిగిన పదవుల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మిషన్ భగీరథ శాఖలను కేటాయించారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎర్రబెల్లి దయాకర్‌రావు క్యాబినేట్ స్థాయి మంత్రి పదవీని కట్టబెట్టడంతో జరిగిన పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో వట్టిచేత్తో వన్‌సైడ్ విజయాలను తన ఖాతాలో వేసుకొని ముఖ్యమంత్రి ప్రశంసలను అందుకున్నారు. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నప్పుడు వరంగల్‌కు మరొకరికి మంత్రి పదవీ వస్తుందన్న అవకాశం ఉండగా మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేకపోవడంతో ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్‌ను నియమించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన దాస్యం వినయ్‌భాస్కర్ రాజకీయ నేపథ్యం ఆదినుండి రాజకీయాల్లో ఉంది. 1994లో హన్మకొండ నుండి ఎంఎల్‌ఎగా గెలిచిన దాస్యం ప్రణయ్‌భాస్కర్‌కు ఎన్‌టి రామారావు ప్రభుత్వంలో మంత్రి పదవీ లభించింది.

ఆయన మరణానంతరం ప్రణయ్‌భాస్కర్ స్థానాన్ని వారి కుటుంబం నుండి భర్తీ చేయడానికి దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఎంఎల్‌ఎ అభ్యర్థిగా 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయించారు. 2004లో ఓటమి పాలైన వినయ్‌భాస్కర్ ఆ తరువాత టిఆర్‌ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ నుండి తొలిసారిగా గెలుపొందారు. ఆతరువాత టిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎల పదవులకు రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో 2010, 11లో వినయ్‌భాస్కర్ మళ్లీ గెలిచారు. 2014లో ఎంఎల్‌ఎగా గెలిచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్‌ఎగా తొలి తెలంగాణ ప్రభుత్వంలో అడుగుపెట్టారు. 2015లో ముఖ్యమంత్రి కెసిఆర్ పార్లమెంట్ కార్యదర్శి పదవీని క్యాబినేట్ ర్యాంకులో నియమించారు. పార్లమెంట్ సెక్రటరి పదవులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని రద్దు చేయడంతో ఆ పదవులు రద్దయ్యాయి.

అప్పటి నుండి 2018 వరకు ఎంఎల్‌ఎగా కొనసాగి 2019లో మళ్లీ ఎంఎల్‌ఎగా గెలిచారు. అయితే మొదటిసారి మంత్రి వర్గ విస్తరణలో దాస్యం వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవీ ఖాయమనుకోగా ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప క్యాబినేట్ విస్తరణకు తెరలేపి ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి దయాకర్‌రావు ఒకరికే అవకాశం కల్పించారు. దాంతో నిరాశకు గురైన వినయ్‌భాస్కర్ ఎక్కడ తగ్గకుండా పార్టీ కార్యక్రమాల్లో నియోజకవర్గ అభివృద్ధిలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. రెండోసారి మంత్రి వర్గ విస్తరణ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమైనప్పటికి తగిన అవకాశం లేకపోవడంతో మంత్రిస్థాయి కలిగిన పదవుల విస్తరణకు తెరలేపారు. అందులో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి వినయ్‌భాస్కర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవీ దక్కడం ఆయన సీనియారిటికి, ఉద్యమ నిబద్ధతకు గుర్తింపు లభించినట్లయింది.

Dasyam Vinaybhaskar as Chief Whip of Government

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ప్రభుత్వ చీఫ్ విప్‌గా దాస్యం వినయ్‌భాస్కర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.