పెరుగుతో చుండ్రు దూరం..

  మగువలకు జుట్టు నల్లగా, పొడుగ్గా, లావుగా ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఆ జుట్టును శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అందులోనూ వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం కొంచెం కష్టమే. తరచూ తడిసే పరిస్థితులు ఉంటే తలకు చుండ్రు పట్టడం, జుట్టు బాగా రాలిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. జుట్టు బలహీనపడి, కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాపాడుకోవాలంటే వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ […] The post పెరుగుతో చుండ్రు దూరం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మగువలకు జుట్టు నల్లగా, పొడుగ్గా, లావుగా ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. కానీ ఆ జుట్టును శాశ్వతంగా జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పనే అని చెప్పాలి. అందులోనూ వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం కొంచెం కష్టమే. తరచూ తడిసే పరిస్థితులు ఉంటే తలకు చుండ్రు పట్టడం, జుట్టు బాగా రాలిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. జుట్టు బలహీనపడి, కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాపాడుకోవాలంటే వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ తీసుకువెళ్లాల్సిందే. అయినప్పటికీ కొన్ని సమస్యలు తప్పవు.

1. తలస్నానానికి రసాయనాలతో తయారైన షాంపూల బదులుగా కుంకుడుకాయలను వాడండి. తలస్నానానికి గంట ముందు భృంగామలక తైలంతో జుట్టు కుదుళ్లకు పట్టేలా నెమ్మదిగా మర్దన చేయాలి. స్నానం తర్వాత తలను బాగా తుడుచుకుని, పొడిగా ఆరిన తర్వాత దువ్వుకోవాలి.
2. జుట్టుకు చుండ్రు పట్టినట్లయితే తాజా వేపాకులు, మెంతులు, ఉసిరికాయలు మెత్తగా నూరుకుని, అందులో చెంచాడు నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తల స్నానం చేయాలి.
3. వారానికి కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తలస్నానం చేయాలి. చుండ్రు నివారణ కోసం తలస్నానానికి ముందు నువ్వులనూనెలో కొన్ని చుక్కల వేపనూనె కలిపి తలకు పట్టించుకోవాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేయాలి.
4. తలకు చుండ్రుపట్టి ఇబ్బందిగా ఉన్నట్లయితే, తలస్నానానికి గంట ముందు కాస్త పెరుగులో నిమ్మరసం పిండుకుని తలకు బాగా పట్టించాలి. తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి.
5. అనుకోకుండా వర్షంలో తడిసినట్లయితే, కేవలం జుట్టు తుడిచేసుకుని అక్కడితో వదిలేయకుండా, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. జుట్టు బాగా ఆరిన తర్వాత కొద్ది చుక్కల వేపనూనె కలిపిన నువ్వులనూనె లేదా ఆమ్లాతైలాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య దాదాపు దరిచేరదు.
6. జుట్టు పొడిబారి రాలిపోతున్నట్లయితే, తల స్నానానికి అరగంట ముందు జుట్టుకు తాజా కలబంద గుజ్జును పట్టించండి. కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయండి. తలకు మా మూలు నూనెల భృంగామలక తైలాన్ని వాడండి. జుట్టు దృఢంగా, కాంతివం తంగా తయారవుతుంది.
7. జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు వానా కాలంలో ఇబ్బంది పెడుతుంటే, వస కొమ్ములతో చక్కని పరిష్కార మార్గం ఉంది. వస కొమ్ము లతో రాత్రంతా నానబెట్టి, తర్వాత వాటిని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఒక టీస్పూను వస కొమ్ముల పొడిని కప్పు, పెరుగులో కలిపి తలకు పట్టిం చాలి. గంట తర్వాత కుంకుడు కా య లు లేదా షీకాయతో తలస్నానం చేయాలి.

Dandruff remove with Curd

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెరుగుతో చుండ్రు దూరం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: