సాహితీవేత్త తిరునగరికి దాశ‌ర‌థి అవార్డు

Daasarathi Krishnamacharyulu Award To Poet Tirunagariహైద‌రాబాద్ : ప్రముఖ సాహితీవేత్త తిరునగరి రామానుజయ్యకు మహాకవి దాశరథి కృష్ణమాచార్య -2020 అవార్డును సిఎం కెసిఆర్ శనివారం ప్రగతిభవన్ లో అందజేశారు. అవార్డుతో  పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపిక‌ను అంద‌జేశారు. అనంతరం తిరునగరిని శాలువాతో కెసిఆర్ సన్మానించారు. దాశరథి అవార్డును పొందడానికి తిరునగరి అన్ని విధాల అర్హుడని సిఎం స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కెసిఆర్ పాడిన పద్యం అందరిని ఆకట్టుకుంది. తిరునగరి ఐదున్నర దశాబ్దాలుగా సాహితీరంగానికి ఎనలేని సేవలు చేస్తున్నారు. 1945లో యాదాద్రి భువనగిరి జిల్లా బేగంపేటలో తిరునగరి జన్మించారు.ఆలేరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. మూడు దశాబ్దాలపాటు ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా మంచి పేరు గడించారు. 30కిపైగా గ్రంథాలు రాశారు. ప్రాచీన సాహిత్యానికి , ఆధునిక కవిత్వానికి తిరునగరి వారధిలా నిలిచారు. తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు ప్రసంగాల ద్వారా గొప్పవక్తగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన ఆకాశవాణి, దూరదర్శన్‌కు వందల లలిత, ప్రభోదాత్మ క, దేశభక్తి గీతాలను రాశారు. అనేక సాహిత్య ప్రసంగాలు చేశారు. పలు సంస్థలు నిర్వహించిన సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాల్లో తిరునగరి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా అధికార భాషా సంఘం సభ్యుడిగా ఉన్నారు. తిరునగరి అనేక అవార్డులు కూడా అందుకున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సాహితీవేత్త తిరునగరికి దాశ‌ర‌థి అవార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.