ఆదిలాబాద్ లో ‘కరెంట్’ఫ్యామిలీ…

Current-Boyఆదిలాబాద్: జిల్లాలోని సిరసన్న రామ్ నగర్ లో విచిత్ర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బల్బులు వెలగాలంటే  విద్యుత్ కావాలి. కరెంటే లేకుండా మనుషులు తాకగానే లైట్లు వెలుగుతాయా? వెలుగుతున్నాయ. వినడానికి వింతగా ఉన్నా, ఇది వాస్తవం. వివరాల్లోకి వెళితే.. సిరసన్న రామ్ నగర్ చెందిన చాంద్ బాషా ఇటీవల బల్బు కొని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో పిల్లలు ఈ బల్బును చేతితో పట్టుకోగానే వెలిగింది.

ఒక్కసారి షాక్ తిన్ని చాంద్ బాషా దాన్ని చేతిలోకి తీసుకోని చూశాడు. అయిన అది వెలుగుతూనే ఉంది. చాంద్ బాషాతో పాటు అతని కుమారుడు, కుమార్తెలు తాకిన బల్బు వెలుగుతోంది. దీంతో ఈ విషయం కాస్త ఆనోటా, ఈనోటా పాకి ఊరిలో ఆ కుటుంబం చిన్నస్థాయి సెలబ్రిటీ ఫ్యామిలీగా మారింది. దీంతో రంగంలోకి దిగిన నిపుణులు వీరిపై పరిశోదనలు చేశారు. ఓ బల్బును వెలిగించే స్థాయిలో వీరి శరీరంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని నిపుణులు పేర్కొన్నారు.

Current Passing in 5 Years Old Boy At Adilabad District

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆదిలాబాద్ లో ‘కరెంట్’ ఫ్యామిలీ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.