దేశ సార్వభౌమాధికారి చిహ్నం ‘కరెన్సీ’

  ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే పైసా మే పరమాత్మ అని అంటారు. అయితే నోటు అనేది సాధారణ కాగితం కాదు. ఒక దేశ సార్వభౌమాధికారి చిహ్నం. వినిమయ సాధనలో ద్రవ్య నిధి ప్రత్యేక పాత్ర. మార్కెట్ క్రయ విక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. ప్రతి దేశం తమ దేశానికి సంబంధించి ప్రత్యేక కరెన్సీని ముద్రించుకుంటుంది. ఏ దేశాల నోట్లు ఆ దేశాల్లో చెల్లుబాటు అవుతాయి. పరాయి దేశంలో మన దేశ కరెన్సీ […] The post దేశ సార్వభౌమాధికారి చిహ్నం ‘కరెన్సీ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏ వస్తువు కొనాలన్నా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అందుకే పైసా మే పరమాత్మ అని అంటారు. అయితే నోటు అనేది సాధారణ కాగితం కాదు. ఒక దేశ సార్వభౌమాధికారి చిహ్నం. వినిమయ సాధనలో ద్రవ్య నిధి ప్రత్యేక పాత్ర. మార్కెట్ క్రయ విక్రయాల్లో నోట్లదే ప్రధాన పాత్ర. ప్రతి దేశం తమ దేశానికి సంబంధించి ప్రత్యేక కరెన్సీని ముద్రించుకుంటుంది. ఏ దేశాల నోట్లు ఆ దేశాల్లో చెల్లుబాటు అవుతాయి.

పరాయి దేశంలో మన దేశ కరెన్సీ విలువ లేకున్నా వినిమయ శక్తి ఉంటుంది. ప్రతి దేశం పలు ప్రత్యేకతలతో భద్రతా పరమైన చర్యలతో నోట్లను ముద్రిస్తుంది. ఇందుకు దేశ సార్వభౌమాధికారి చిహ్నాలు సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆనవాళ్ళు. జాతి పితల, ముఖ్య నేతల చిత్రాలు నోట్లపై పొందుపరుస్తారు. ఇండియన్ కరెన్సీ (నోట్లు), వాటి వెనుక చిహ్నాలు, చరిత్ర వాటి ప్రత్యేకతలపై “మన తెలంగాణ” అందిస్తున్న ప్రత్యేక కధనం.

కొణిజర్ల : రూపాయి నోట్ సాగర్ సామ్రాట్….
మన కరెన్సీలు రూపాయి నోటుకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఈ నోటు వెనుక సాగర్ సామ్రాట్ ఆయిల్ రింగ్ కనబడుతుంది. ఓఎన్‌జిసికి చెందిన ఈ ఆయిల్ రింగ్ దేశ మౌలిక వసతులను తెలియజేస్తుంది.

రూ. 2 నోటు వ్యాఘ్రరాజం…
2 రూపాయల నోటుపై మన జాతీయ జంతువు పులి బొమ్మ ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాముఖ్యత ఇస్తూ నోటు పై వ్యాఘ్ర బొమ్మ ముద్రించారు.

రూ. 5 నోటు వ్యవసాయం…
రూ. 5 నోటు వెనుక ముద్రించిన ట్రాక్టర్ వ్యవసాయ పనులను, నిర్మాణ రంగంలో ఎక్కువగా వాడుకలో ఉన్న కార్యకలాపాలను తెలియజేస్తుంది. ట్రాక్టర్ అనే పదం ట హెర్ లాటిన్ పదం నుండి వచ్చింది. దేశం వ్యవసాయ రంగానికి వెన్నుముక లాంటిది అని తెలియజేసే ఉద్దేశంతో 5 రూపాయల నోటుపై ఈ బొమ్మను ముద్రించారు.

రూ. 10 నోటు వన్యప్రాణులు..
పది రూపాయల నోటు వెనుక వన్య ప్రాణులు అయిన ఏనుగు, పులి, ఖడ్గ మృగం బొమ్మలు కనిపిస్తాయి. భారతీయ ఖడ్గమృగం ఓ పెద్ద క్షిరథం. అస్సాంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గంటకు 25 కిలోమిటర్ల వేగంతో ఇవి పరుగెత్తగలవు. ఈతలో ప్రావీణ్యం ఉన్న జంతువు ఇది. ఇది మందమైన చర్మం కలిగి ఉంటుంది. ఆసియా ఏనుగులు ఆఫ్రికా ఎనుగుల కంటే కొంచెం చిన్నవిగా ఉంటాయి. రెండు వేల నుండి 5 వేల కేజీల వరకు బరువు ఉంటుంది. బెంగాల్ టైగర్‌ను రాయల్ బెంగాల్ టైగర్ అని అంటారు. ఇది మన జాతీయ జంతువు.

రూ. 20 నోటు.. వన్యప్రాణులు…
20 రూపాయల నోటుపై అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్‌బ్లెయిన్ లో మౌంట్ హరియట్ నేషనల్ పార్కు చిత్రాన్ని ముద్రించారు. దీన్ని 1979లో నిర్మించారు. ఈ పార్క్ విస్తీర్ణం 46.62 కిలోమీటర్లు.

రూ. 100 నోటు.. రాణి కి వావ్…
రిజర్వు బ్యాంక్ నూతనంగా ముద్రించిన రూ. 100 నోటు గుజరాత్‌లోని పట్టణానికి చెందిన ప్రసిద్ద రాణికి వావ్ కట్టడం చోటు దక్కించుకుంది. ఈ చరిత్ర కట్టడాన్ని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది.

రూ. 500 నోటు.. ఎర్రకోట…
దేశ అద్భుత కట్టడాల్లో ఎర్రకోట ఒకటి. స్వతంత్ర సంబరాలకు చిహ్నం అదే ఢిల్లీలోని ఎర్రకోట. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో మువ్వన్నెల జెండాను ప్రధాని ఎగురవేస్తారు. ఈ కోటకు 360 ఏళ్ళ చరిత్ర ఉంది. దీన్ని నిర్మాణాన్ని 1638లో మొదలు పెడితే 1648లో పూర్తయింది. యమున నది ఒడ్డున ఉన్న కోట మొత్తం 120 ఎకరాల స్థలంలో ఉంది.

రూ. 2000 నోటు.. మంగళయాన్….
పెద్ద నోట్లు తరువాత రెండు వేల నోటును రిజర్వ్ బ్యాంకు అమల్లోకి తెచ్చింది. ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, కుడి వైపు అశోకుడి స్థూపం ముద్రించారు. వెనుకవైపు స్వచ్ఛ భారత్ లోగో, మంగళయాన్ ప్రయోగం చేసిన చిహ్నము ముద్రించారు. గులాబి రంగులో ఉన్న ఈ నోటు ముద్రణలో 19 జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల నోటుకు నకిలీ చేయటం సాధ్యం కాదని కేంద్రం చెబుతుంది.

Currency is symbol of the Sovereign of Country

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేశ సార్వభౌమాధికారి చిహ్నం ‘కరెన్సీ’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: