ప్రమాదకరంగా కల్వర్టు…

R&B officers monitoring error

నార్నూర్‌ః  ఇటీవల కురిసిన భారీ వర్షానికి మండలంలోని బోజ్జుగూడ గ్రామ సమీపం వద్ద ప్రధాన రహదారిపై కల్వర్టు, బిటిరోడ్డు కొతకు గురై ప్రమాదకరంగా మారిందని ప్రజలు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో తెలంగాణ ప్రభుత్వం రూ. కోట్లు మంజూరు చేసిందన్నారు. ఆర్‌అండ్‌బి అధికారుల పర్యవేక్షణ లోపంతో సదరు కాంట్రాక్టరు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో వర్షానికి బిటితోపాటు కల్వర్టు కొతకు గురైందని ఆరోపిస్తున్నారు. కల్వర్టు ప్రమాదకరంగా తయారై నెల కావస్తున్న కనీసం ఆర్‌అండ్‌బి అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమంటున్నారు. కల్వర్టుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. రాత్రి వేళ్లలో అదుపు తప్పి గుంతలో పడాల్సి వస్తుందని వాపోతున్నారు. చాలా మంది అదుపు తప్పి పడిపోయారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిశాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు సంభవించి ప్రాణాలు కొల్పొకముందే కల్వర్టుకు మరమ్మత్తులు చేపట్టాలని, నాణ్యత పాటించాలని, కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.