‘భక్త రామదాసు’ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు

  500 క్యూసెక్యుల నీరు అందుబాటులో నీటిని పొదుపుగా వాడుకోండి వీలైనంత వరకు ఎక్కువ చెరువులను ఈ నీటి ద్వారా నింపాలి పాలేరు ఎంఎల్‌ఏ కందాళ ఉపేందర్‌రెడ్డి కూసుమంచి : మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్‌లో గల భక్తరామదాసు ప్రాజెక్టు రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేశామని పాలేరు నియోజకవర్గ శాసన సభ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన అధికారికంగా రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […] The post ‘భక్త రామదాసు’ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

500 క్యూసెక్యుల నీరు అందుబాటులో
నీటిని పొదుపుగా వాడుకోండి
వీలైనంత వరకు ఎక్కువ చెరువులను ఈ నీటి ద్వారా నింపాలి
పాలేరు ఎంఎల్‌ఏ కందాళ ఉపేందర్‌రెడ్డి

కూసుమంచి : మండల పరిధిలోని పాలేరు రిజర్వాయర్‌లో గల భక్తరామదాసు ప్రాజెక్టు రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేశామని పాలేరు నియోజకవర్గ శాసన సభ్యులు కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన అధికారికంగా రెండు మోటర్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలె, ఖమ్మం రూరల్ మండలాల్లోని సుమారు 70 వేల ఎకరాలకు పాలేరులోని భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఒకే మోటర్ నడుస్తున్న దృష్టా రెండవ మోటర్‌ను కూడా ఆన్ చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కందాళ కోరగా సంబంధిత అధికారులు స్పందించి రెండవ మోటర్‌ను ఆన్ చేశారు. ప్రస్తుతం భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 500 క్యూసెక్యుల నీరు రైతులకు అందుబాటులోకి వస్తుందన్నారు.

ఈ నీటిని రైతులు పొదుపుగా వాడుకుని పంట పొలాలకు అందే విధంగా సహకరించాలన్నారు. ఇష్టానుసారంగా గం డ్లు పెట్టటం కాని, కాలువలు తెంపటం కాని చేస్తే సంబంధిత అధికారులు నీటిని నిలిపివేసే పరిస్థితి ఉందన్నారు. రైతులు తమ స్వంత విషయంలో ఎలా శ్రద్ధ తీసుకుంటారో జాగ్రత్తగా నీటిని పొదుపుగా వాడుకోవాలని కందాళ కోరారు. వీలైనంత వరకు నియోజకవర్గ పరిధిలోని ఎక్కువ చెరువులను ఈ నీటి ద్వారా నింపాలని ఎన్నెస్పీ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన అధికారులు ఎస్‌ఆర్‌ఎస్‌పీ, ఎన్‌ఎస్‌పీ, ఐబీ మూడు శాఖల సమన్వయంతో ఇప్పటికే జేసీబీల ద్వారా కాలువలకు మరమ్మత్తులు చేసి నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రైతులు గమనించి ఎవరికి వారుగా బాధ్యతగా తీసుకుని నీటిని వినియోగించుకోవాలని కందాళ కోరారు.

Cultivated water through Bhakta Ramadasu project

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘భక్త రామదాసు’ ప్రాజెక్టు ద్వారా సాగు నీరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: