చిన్నారి ఆకలి తీర్చిన జవాను…

జమ్మూ కశ్మీర్: శ్రీనగర్ వీధుల్లో ఆకలితో ఓ షాప్ ముందు కూర్చున్న ఓ దివ్యాంగ చిన్నారికి ఓ జవాను అన్నం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిఆర్పీఎఫ్‌ జవాను ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే..తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సిఆర్పీఎఫ్‌ హెడ్ కానిస్టేబుల్ అయిన ఇక్బాల్‌ సింగ్‌ పక్షవాతం ఉన్న చిన్నారికి తన టిఫిన్‌ బాక్సులోని అన్నం స్వయంగా తినిపించాడు. ఇక్బాల్‌ సింగ్‌ మానవత్వంతో ఆ చిన్నారికి అన్నం తినిపిస్తుండగా తోటి సిబ్బంది వీడియో […] The post చిన్నారి ఆకలి తీర్చిన జవాను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జమ్మూ కశ్మీర్: శ్రీనగర్ వీధుల్లో ఆకలితో ఓ షాప్ ముందు కూర్చున్న ఓ దివ్యాంగ చిన్నారికి ఓ జవాను అన్నం తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిఆర్పీఎఫ్‌ జవాను ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే..తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సిఆర్పీఎఫ్‌ హెడ్ కానిస్టేబుల్ అయిన ఇక్బాల్‌ సింగ్‌ పక్షవాతం ఉన్న చిన్నారికి తన టిఫిన్‌ బాక్సులోని అన్నం స్వయంగా తినిపించాడు. ఇక్బాల్‌ సింగ్‌ మానవత్వంతో ఆ చిన్నారికి అన్నం తినిపిస్తుండగా తోటి సిబ్బంది వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్బాల్‌ మంచితనాన్ని కొనియాడుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి జరిగిన రోజు జరిగింది.

CRPF jawan feeds distressed boy in Jammu Kashmir

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చిన్నారి ఆకలి తీర్చిన జవాను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: