మూడు ముఠాలు అరెస్టు : కోటి రూపాయల విలువైన బైక్ లు స్వాధీనం

హైదరాబాద్ : జంట నగరాల్లో బైక్ లను చోరీ చేస్తున్న మూడు ముఠాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన 15 మంది ముఠా సభ్యుల నుంచి కోటి రూపాయల విలువైన 77 బైక్ లను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. ముఠా సభ్యులు రెక్కీ నిర్వహించి ఖరీదైన బైక్ లను చోరీ చేసేవారని సిపి తెలిపారు. ఈ క్రమంలో కార్ఖానా పోలీసు స్టేషన్ […] The post మూడు ముఠాలు అరెస్టు : కోటి రూపాయల విలువైన బైక్ లు స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : జంట నగరాల్లో బైక్ లను చోరీ చేస్తున్న మూడు ముఠాలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్టు అయిన 15 మంది ముఠా సభ్యుల నుంచి కోటి రూపాయల విలువైన 77 బైక్ లను స్వాదీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు తెలిపారు. ముఠా సభ్యులు రెక్కీ నిర్వహించి ఖరీదైన బైక్ లను చోరీ చేసేవారని సిపి తెలిపారు. ఈ క్రమంలో కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో ఆదిల్, మోసిన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని, వారిని విచారించిన క్రమంలో బైక్ లను చోరీ చేసే మూడు ముఠాల గుట్టు రట్టయిందని ఆయన పేర్కొన్నారు. సిపి పుటేజీల ఆధారంగా మొదట ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, అనంతరం మరికొందరిని అరెస్టు చేశామని సిపి వెల్లడించారు. తమతమ కాలనీల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సిసి కెమెరాలు ఉంటే చోరీ కేసులను సులభంగా చేధించవచ్చని ఆయన చెప్పారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మూడు ముఠాలు అరెస్టు : కోటి రూపాయల విలువైన బైక్ లు స్వాధీనం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: