పంట రుణ మాఫీకి కసరత్తులు

Crop loan

 

ఉమ్మడి జిల్లాలో రూ.2వేల కోట్ల రుణాల మాఫీ
ఈ సారి పంట రుణాల మాఫీలో నూతన విధానం
రైతు చేతికే రుణమాఫీ చెక్కులు
2018 డిసెంబర్ 11 కటాఫ్ తేదీ
ఉమ్మడి జిల్లాలో 3.80 లక్షల మంది రైతులకు లబ్ధి

రైతుల రుణ మాఫీ కోసం కసరత్తు జరుగుతున్నాయి. వచ్చే నెలలో ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ అనంతరం రుణమాఫీ అమలులోకి వచ్చే అవకాశాలు ఉండటంతో జిల్లాలో మాఫీ అయ్యే రుణాల లెక్కలను బ్యాంకర్లు సిద్ధం చేస్తున్నారు. 2018లో డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయాలలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతులు ఎంత మంది ఉన్నారు, ఎన్ని కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి వస్తుందనే అంశంపై లెక్కలు తీస్తున్నారు. త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో రుణమాఫీ పథకానికి రూ.7వేల కోట్ల నిధులను తొలివిడతగా కేటాయించబోతున్నారు. ఒకే సారి కాకుండా విడతల వారిగా నిధులను కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఈసారి రుణమాఫీ విషయంలో కొత్త విధి విధనాలను రూపొందించి అమలు చేసే అవకాశం ఉంది. ఈసారి రుణమాఫీ సొమ్మును నేరుగా రైతు ఖాతాలోనే జమ చేయాలనే ప్రతిపాదన ఉంది.

ఖమ్మం : అన్నదాతకు రుణమాఫీ పథకం వరం లాంటిది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ పథకాన్ని అమలు చేశారు. రెండోసారి అధికారంలోకి రాకముందు జరిగిన ఎన్నికల ప్రచారసభలో తాము అధికారంలోకి వస్తే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి మేనిఫేస్టోలో కూడా పొందుపర్చారు. దానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టబోతుంది. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ పథకానికి రూ.7వేల కోట్ల నిధులను కేటాయించబోతున్నారు. రుణమాఫీ కోసం రైతులు గత ఆరు నెలల నుంచి ఎంతో ఆశగా ఎదురు చూ స్తున్నారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగు కోసం రుణా లు తీసుకోవడానికి ప్రయత్నించగా బ్యాంకర్లు రైతులకు కొత్త రుణాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయకుండా పాత రుణాల పేరుతో చాలా చోట్ల రైతులను ఇబ్బందులకు గురి చేశారు. మరికొన్ని బ్యాంకర్లు అయితే ‘రైతు బంధు’ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేసిన డబ్బులను పాత బకాయిల కింద జమ చేసుకుంటామని ఇబ్బంది పెట్టారు. ఈ ఖరీఫ్‌లో పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఈ సారి జిల్లా లీడ్ బ్యాంక్ అధికారులు ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసినప్పటికి క్షేత్ర స్థాయిలో బ్యాంకర్లు పంట రుణాల మంజూరుకు ముప్పు తిప్పలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన స్కేల్ ఆఫ్ క్రాఫ్ అనుగుణం గా కూడా రుణాలను మంజూరు చేయడం లేదు.

ఖరీఫ్ యాక్షన్ ప్లాన్‌లో పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేట్‌బ్యాంకులు పంట రుణాల టార్గెట్‌ను కేటాయించినప్పటికీ ఆచరణలో మాత్రం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలను మాఫీ చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం రూ.3, 84,468 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయగా అందులో పంటల రుణాల కోసం రూ.2, 16, 990లక్షలు కేటాయించారు. కానీ వాస్తవానికి రైతులకు రుణాలను పంపిణీ చేసింది యాభైశాతానికి మించలేదు. అనేక కొర్రీలు పెట్టి రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకున్నాయి. ఈ నేపథ్యంలో రైతులంతా పంట రుణాల మాఫీ అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా అధికారంలో వచ్చిన తరువాత 2014లో పూర్వ ఖమ్మం జిల్లాలో 3.80లక్షల మందికి చెందిన రూ.1631 కోట్ల పంట రుణాలను రద్దు చేశారు.

ఈ సారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి దాదాపు రూ.2వేల కోట్ల మాఫీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 2,68,499 మంది రైతులు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,22,425 మంది రైతులు ఉన్నారు. 2018 డిసెంబర్ 11 వరకు లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతు ల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. గతంలో రుణమాఫీ అమలు విషయంలో బ్యాం కర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో ఈసారి కొత్త విధి విధానాలను తయా రు చేస్తున్నారు. రుణమాఫీ నిధులను నేరుగా బ్యాంకర్లకే అందజేయాల న్నా లేక రైతు పేర్లతో చెక్కులను వారికే అందజేయా లా? లేదా రైతు ఖాతాలోకి జమ చేయాలా? అనే అం శంపై తర్జన భర్జన చేస్తున్నారు. ఒకేసారి రుణమాఫీ మొ త్తాన్ని మాఫీ చేయాలా? లేక విడతల వారిగా చేయా లా? అనే దానిపై కూడా పునఃరాలోచన చేస్తున్నట్లు సమాచారం.

Crop loan waiver to Farmers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పంట రుణ మాఫీకి కసరత్తులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.