జూరాల కాలువలో మొసలి సంచారం

వనపర్తి : జూరాల కాలువలో మొసలి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో నదిలోకి మొసళ్లు వచ్చి చేరినట్టు అధికారులు తెలిపారు. నందిమళ్ల గ్రామ శివారులోని ఎడమ కాలువ 2.23 అక్విడెక్ట్ బ్రిడ్జి (సిక్కులోల బ్రిడ్జి) సమీపంలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. జెన్‌కో ప్రాంతంలో కూడా మొసళ్లు సంచరిస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. జూరాల కాలువలో మొసళ్లు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా […]

వనపర్తి : జూరాల కాలువలో మొసలి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో కృష్ణానదికి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో నదిలోకి మొసళ్లు వచ్చి చేరినట్టు అధికారులు తెలిపారు. నందిమళ్ల గ్రామ శివారులోని ఎడమ కాలువ 2.23 అక్విడెక్ట్ బ్రిడ్జి (సిక్కులోల బ్రిడ్జి) సమీపంలో మొసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. జెన్‌కో ప్రాంతంలో కూడా మొసళ్లు సంచరిస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు తెలిపారు. జూరాల కాలువలో మొసళ్లు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Crocodile Hulchul in Jurala Canal at Wanaparthy

Comments

comments

Related Stories: