సఫారీలపై అభిమానులు ఫైర్

South-Africa

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికా క్రికెటర్ల పేలవమైన ప్రదర్శనపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జట్టు ఆటపై వారు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. గతంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టు ఇంత చెత్తగా ఆడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. జట్టును ముందుండి నడిపించడంలో కెప్టెన్ డుప్లెసిస్ ఘోరంగా విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.

భారత్‌కు కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేయడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇలాంటి ఆటతో బలమైన భారత్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, జట్టు బ్యాటింగ్ చాలా చెత్తగా ఉందని, ఒక్కరూ కూడా జట్టుకు అండగా నిలువక పోవడం బాధాకరమని వాపోయారు. జట్టును ముందుండి నడిపించాల్సిన సీనియర్లు పేలవమైన ఆటతో నిరాశే మిగుల్చుతున్నారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత చెత్త ప్రదర్శన చేయలేదని, కానీ ఈసారి భారత పర్యటనలో తమ జట్టు ఘోరంగా విఫలమైందని సౌతాఫ్రికా అభిమానులు పేర్కొన్నారు.

Criticism of South African cricketers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సఫారీలపై అభిమానులు ఫైర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.