ఆడితేనే డబ్బులు!

IPL

 

ముంబై: కరోనా నేపథ్యంలో ఈసారి ఐపిఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఐపిఎల్ జరుగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇదే జరిగితే క్రికెటర్లు భారీగా నష్టపోవడం ఖాయమనే చెప్పాలి. ఐపిఎల్ నిబంధనల ప్రకారం ఏ ఆటగాడికైన మ్యాచ్‌లు ఆడితేనే డబ్బులు చెల్లించాలనే రూల్ ఉంది. ఈసారి నిబంధనను ప్రతి ఫ్రాంచైజీ తనకు అనుకూలంగా మార్చుకోడం ఖాయంగా మారింది.

ఎందుకంటే కరోనా నేపథ్యంలో ఐపిఎల్ పూర్తిగా రద్దయితే క్రికెటర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించమని ఇప్పటికే పలు ఫ్రాంచైజీల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. టోర్నీ జరుగక పోతే తమకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవని, ఇలాంటి పరిస్థితుల్లో క్రికెటర్లకు డబ్బులు ఇవ్వడం తమకు సాధ్యం కాదని తేల్చి చెప్పాయి. కాగా, ఐపిఎల్ టోర్నీ జరిగితే ప్రతి ఫ్రాంచైజీ క్రికెటర్లకు కనీసం 70 నుంచి 80 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కరోనా కారణంగా ఐపిఎల్ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఫ్రాంచైజీలు పూర్తిగా చేతులెత్తేయడం ఖాయం.

యువ క్రికెటర్లకే నష్టం
కాగా, ఐపిఎల్ రద్దయితే యువ క్రికెటర్లు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక, ఎన్నో ఏళ్లుగా ఐపిఎల్ ఆడుతున్న సీనియర్లు ధోనీ, కోహ్లి, రోహిత్, బుమ్రా, షమీ, ఇషాంత్, అశ్విన్, జడేజా, రైనా తదితరులకు వచ్చే నష్టమేమీ ఉండదు. ఇప్పటికే వీరం తా కోట్లాది రూపాయలను సంపాదించారు. కానీ, ఈ ఏడాది ఆయా ఫ్రాంచైజీలకు ఎంపికైన క్రికెటర్లకు మాత్రం పెద్ద షాక్‌గానే చెప్పాలి.

దేశవాళి క్రికెట్‌లో, అండర్19 విభాగంలో రాణిస్తున్న చాలా మంది యువ క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వీరికి 20 నుంచి 50 లక్షల రూపాయల వరకు పారితోషికాన్ని అందించేందుకు అంగీకరించాయి. అయితే ఈసారి ఐపిఎల్ రద్దయితే మాత్రం ఈ యువ క్రికెటర్లకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదు. ఇప్పటికే పలు డొమెస్టిక్ టోర్నీలు కరోనా వల్ల రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలకు దూరంగా ఉన్న క్రికెటర్లకు చెల్లించే వేతనాల్లో భారీ కోత విధించాలని బిసిసిఐ ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా ఐపిఎల్‌పై కూడా నీలినీడలు కమ్ముకోవడంతో యువ క్రికెటర్ల పరిస్థితి అయోయమంగా మారింది.

Cricketers who stand to lose the most if IPL cancelled

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆడితేనే డబ్బులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.