శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత

 

న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్ శ్రీశాంత్ ఎట్టకేలకు ఊరట లభించింది. శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని 7 సంవత్సరాలకు తగ్గిస్తూ బిసిసిఐ అంబుడ్స్‌మన్ డీకె జైన్ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటికే 6 సంవత్సరాలుగా నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌కు 2020 ఆగస్టులో విముక్తి లభించనుంది. దీంతో సెప్టెంబర్‌ నుంచి శ్రీశాంత్ మరోసారి మైదానంలో దిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 36 ఏళ్ల శ్రీశాంత్‌… కేరళ తరఫున, విదేశీ లీగుల్లో ఆడాలని భావిస్తున్నాడు. గత 6 సంవత్సరాల్లో శ్రీశాంత్ నడవడికలో మార్పు వచ్చిందని అందుకే నిషేధంపై పునరాలోచన చేసినట్లు బిసిసిఐ ప్రతినిధులు తెలిపారు.

కాగా, 2013లో ఐపిఎల్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. దీంతో తనపై విధించిన నిషేధంపై శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీం ఈ ఏడాది మార్చి నెలలో జీవితకాల నిషేధం ఎత్తివేయాలని బిసిసిఐని ఆదేశించింది. దీంతో సమావేశమైన బిసిసిఐ అంబుడ్స్‌మన్ శ్రీశాంత్ నిషేధం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Cricketer Sreesanth’s life ban reduced to seven years

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.