క్రికెట్‌లో శిక్షణ

తెలుగు సినిమా దశ దిశ మారిందని ఇప్పటికే ఫిల్మ్‌మేకర్స్ నిరూపించారు. విభిన్నమైన కథాంశాలు, కొత్త తరహా ఫిల్మ్‌మేకింగ్‌తో టాలీవుడ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక హీరోలు కూడా తమ రొటీన్ పంథాను విడిచి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. పాత్రలను ఏదో చేశామన్నట్టుగా కాకుండా పాత్రల తీరుతెన్నులను ఆకళింపు చేసుకొని మరీ నటనకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం  నాని కూడా ఇదే చేస్తున్నాడు. నాగార్జునతో కలిసి నాని ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల […]

తెలుగు సినిమా దశ దిశ మారిందని ఇప్పటికే ఫిల్మ్‌మేకర్స్ నిరూపించారు. విభిన్నమైన కథాంశాలు, కొత్త తరహా ఫిల్మ్‌మేకింగ్‌తో టాలీవుడ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక హీరోలు కూడా తమ రొటీన్ పంథాను విడిచి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. పాత్రలను ఏదో చేశామన్నట్టుగా కాకుండా పాత్రల తీరుతెన్నులను ఆకళింపు చేసుకొని మరీ నటనకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం  నాని కూడా ఇదే చేస్తున్నాడు. నాగార్జునతో కలిసి నాని ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత నాని ‘జెర్సీ’ అనే క్రికెట్ నేపథ్యం ఉన్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో అతను క్రికెటర్ పాత్ర పోషిస్తాడు. దీంతో తన పాత్రను మరింతగా రక్తికట్టించేందుకు క్రికెట్‌లో శిక్షణ తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడట. ‘దేవదాస్’ సినిమా ప్రమోషన్స్ హంగామా ముగిసిన తర్వాత అక్టోబర్ మొదటి వారం నుండి నాని క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటాడు. ‘జెర్సీ’ రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో ‘నర్తనశాల’ ఫేం కష్మీర పరదేశి హీరోయిన్. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Comments

comments

Related Stories: