అభిమానుల అత్యుత్సాహం

India-vs-South-Africa

రాంచీ: భారత్‌దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో క్రికెటర్లకు అభిమానుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే విశాఖలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అభిమానులు నేరుగా మైదానంలోకి దూసుకొచ్చి క్రికెటర్లకు ఇబ్బంది కలిగించిన విషయం తెలిసిందే. అభిమానుల తీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా క్రికెట్ వ్యాఖ్యతలు గవాస్కర్, మంజ్రేకర్ తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో కూడా ఓ అభిమాని నేరుగా మైదానంలోకి దూసకొచ్చాడు. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నా అభిమానులు ఏకంగా పిచ్‌లోకి దూసుకు రావడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇక, రాంచీ మ్యాచ్‌లో కూడా ఓ అభిమాని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ వద్దకు దూసుకొచ్చాడు. ఇదే సమయంలో డికాక్‌ను గట్టిగా కౌగిలించేందుకు ప్రయత్నించాడు. కాగా, ఈ సమయంలో భద్రత సిబ్బంది ఆ అభిమానికి పట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో అతను పట్టువీడకుండా డికాక్‌ను కలిసేందుకు ప్రయత్నించగా అభిమానికి భద్రత సిబ్బంది దేహశుద్ధి చేశారు. మరోవైపు ఈ సంఘటనపై సౌతాఫ్రికా క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Cricket Fans Enter in Ground during India vs South Africa

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అభిమానుల అత్యుత్సాహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.