క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టివి, ఐదు మొబైల్ ఫోన్లు, 32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కార్వాన్, గుడిమల్కాపూర్‌కు చెందిన మల్లేష్, నరేష్, మల్లికార్జున్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముగ్గురు కలిసి ఫోన్ ద్వారా బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారి నుంచి ఫోన్ ద్వారా మాట్లాడి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20మంది […] The post క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యులు గల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టివి, ఐదు మొబైల్ ఫోన్లు, 32,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కార్వాన్, గుడిమల్కాపూర్‌కు చెందిన మల్లేష్, నరేష్, మల్లికార్జున్ ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ముగ్గురు కలిసి ఫోన్ ద్వారా బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారి నుంచి ఫోన్ ద్వారా మాట్లాడి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20మంది పంటర్స్ ద్వారా డబ్బులు తీసుకుని, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

గత మూడు నెలల నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నిర్వాహకుడైన మల్లేష్ తనకు సాయం చేస్తున్న నరేష్, మల్లికార్జున్‌కు కమీషన్ ఇచ్చేవాడు. మంగళవారం జరిగి ఐపిఎల్ మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై బెట్టింగ్ నిర్వహించేందుకు లంగర్‌హౌస్ సమీపంలోని హోటల్ డోవ్‌లో రూమ్ తీసుకున్నారు. అక్కడి నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి వారిని అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సైలు మల్లికార్జున్, భాస్కర్ రెడ్డి, దుర్గారావు, ఎండి ముజఫర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.

Cricket betting gang arrested in Hyd

The post క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: