పివికి నివాళులర్పించిన సిపిలు

CPs to Ex PM PV Narasimha Rao in Cyberabad

 

హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావు ఊపిరి పోశారని రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డిజి మహేష్ భగవత్ అన్నారు. మాజీ ప్రధాన మంత్రి పివి నరసింహారావు జయంతి ఉత్సవాల సందర్భంగా నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆయన చిత్ర పటం వద్ద పూలు వెసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి ముందు చూపు ఉన్న నాయకుడని అన్నారు. అపర మేధావి అని 16 భాషలను అనర్గలంగా మాట్లాడగలరని అన్నారు.

వాటర్ షెడ్ పథకాన్ని ప్రవేశపెట్టింది పివినే అని తెలిపారు. లైసెన్స్ రాజ్ వ్యవస్థను సస్పెండ్ చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాడని అన్నారు. తెలంగాణకు పివి నరసింహారావు గర్వకారణమని అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు తెలిపాడని అన్నారు. కార్యక్రమంలో డిసిపిలు రక్షిత మూర్తి, ఎడిసిపి శిల్పవల్లి, ఎసిపి కుషాయిగూడ, ఇన్స్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో…
మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పివి నరసింహారావు జయంతి సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు, డిసిపిలు, ఎసిపిలు తదితరులు పాల్గొన్నారు.

సైబరాబాద్‌లో….
దివంగత ప్రధాన మంత్రి పివి నరసింహారావు చిత్రపటం వద్ద పూలు వేసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ నివాళులర్పించారు. పివి జయంతి సందర్భంగా గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసు అధికారులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ మాట్లాడుతూ పివి నరసింహారావు 17భాషల్లో మాట్లాడగలరని అన్నారు. దేశంలోని తెలుగు, తమిళం, మారాఠి తదితరాలతోపాటు విదేశీ భాషలైన పర్షియన్, స్పానిష్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్,అరబిక్ మాట్లాడగలరని తెలిపారు. హింది,మరాఠి,తెలుగులో చాలా పుస్తకాలు రాశారని అన్నారు.

నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు ఆద్యుడు పివి నరసింహారావు అని తెలిపారు. రాజీవ్‌గాంధీ క్యాబినెట్‌లో హెచ్‌ఆర్‌డి శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. ఎడిసిపి మాణిక్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ వ్యక్తి పివి నరసింహారావు అని అన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే విధంగా చేశారని అన్నారు. కార్యక్రమంలో ఎసిపి లక్ష్మినారాయణ, ఎసిపి సంతోష్ కుమార్, ఐటి ఇన్స్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్, ఆర్‌ఐ మట్టయ్య తదితరులు పాల్గొన్నారు.

CPs to Ex PM PV Narasimha Rao in Cyberabad

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పివికి నివాళులర్పించిన సిపిలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.