గణేశ్ నిమజ్జనానికి సిపిసిబి నూతన మార్గదర్శకాలు విడుదల

  మనతెలంగాణ/హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి సంబంధించి సిపిసిబి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వినాయకుడి నిమజ్జనం అనంతరం వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు చార్జీలను వసూలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) అన్ని రాష్ట్రాల పిసిబిలకు సూచించింది. ఈ మేరకు విధి, విధానాలను విడుదలచేసింది. వీటిని రాష్ట్రాల బోర్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిపిసిబి ఆదేశించింది. నిమజ్జనాన్ని, అనంతరం వ్యర్థాలను వెలికితీసే వరకు అన్ని రాష్ట్రాల పిసిబిలు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించింది. లక్ష జనాభా మించిన […] The post గణేశ్ నిమజ్జనానికి సిపిసిబి నూతన మార్గదర్శకాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ/హైదరాబాద్: గణేశ్ నిమజ్జనానికి సంబంధించి సిపిసిబి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. వినాయకుడి నిమజ్జనం అనంతరం వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు చార్జీలను వసూలు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) అన్ని రాష్ట్రాల పిసిబిలకు సూచించింది. ఈ మేరకు విధి, విధానాలను విడుదలచేసింది. వీటిని రాష్ట్రాల బోర్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిపిసిబి ఆదేశించింది. నిమజ్జనాన్ని, అనంతరం వ్యర్థాలను వెలికితీసే వరకు అన్ని రాష్ట్రాల పిసిబిలు ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించింది. లక్ష జనాభా మించిన టైర్ -1 నగరాల్లో పిసిబి అధికారులు పర్యవేక్షణ జరపాలని పిసిబి సూచించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఓపి), థర్మాకోల్, ప్లాస్టిక్ వాడకాన్ని సిపిసిబి పూర్తిగా నిషేధం విధించింది.

ప్రస్తుతం సిపిసిబి సూచించిన విధి, విధానాలు ఈ విధంగా ఉన్నాయి.
1. నిమజ్జన కొలనులను శుభ్రం చేయడానికి, శానిటైజేషన్ కోసం, వ్యర్థాలు తొలగించేందుకు విసర్జన్ చార్జీలను వసూలుచేయాలి.
2. విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలికంగా నిమజ్జన కొలనులను ఏర్పాటు చేసుకోవాలి. 3.విగ్రహాలను నిమజ్జనం చేశాక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
4. విగ్రహాలతో పాటు వచ్చే పూజ సామగ్రి, పూలవంటి వాటిని ముందుగానే తొలగించి, కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలి.
5. నవరాత్రుల్లో భాగంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషిద్ధం. ఎకో ఫ్రెండ్లీ వస్తు సామగ్రిని మాత్రమే వినియోగించాలి.
6. విగ్రహాలను సహజ రంగులతోనే అలంకరించాలి. ఎండిన ఆకులు, పూలు, బెరడులతో తయారుచేసిన రంగులనే వినియోగించాలి.
7. కాలుష్య తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు పిసిబి అధికారులు నిమజ్జనానికి ముందు, నిమజ్జన మూడో, ఐదో, ఏడో, తొమ్మిది రోజుల్లో నిమజ్జన కొలనుల్లో నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించాలి.

CPCB releases idol immersion new guidelines

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గణేశ్ నిమజ్జనానికి సిపిసిబి నూతన మార్గదర్శకాలు విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: