రవిప్రకాశ్‌ అరెస్ట్‌కు ప్రత్యేక బృందం ఏర్పాటు

మన తెలంగాణ/హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశామని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను రాకపోవడంపై సిపి సీరియస్ అయ్యారు. ఇదిలావుండగా ఆదివారం సైబర్ క్రైం పోలీసులు బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటి సమీపంలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిఘా సారిస్తున్నారని తెలిపారు. రవిప్రకాశ్ ఇంట్లో అతని గురించి […] The post రవిప్రకాశ్‌ అరెస్ట్‌కు ప్రత్యేక బృందం ఏర్పాటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్‌ను అరెస్టు చేసేందుకు సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేశామని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పోలీసుల ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చినప్పటికీ అతను రాకపోవడంపై సిపి సీరియస్ అయ్యారు. ఇదిలావుండగా ఆదివారం సైబర్ క్రైం పోలీసులు బంజారాహిల్స్‌లోని రవిప్రకాశ్ ఇంటి సమీపంలో రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున నిఘా సారిస్తున్నారని తెలిపారు. రవిప్రకాశ్ ఇంట్లో అతని గురించి వాకబు చేయగా ఇంట్లో లేరని, బయటకు వెళ్లారని సమాధానమిచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ ఆచూకీ కోసం ఆయన సన్నిహితులు, టివి9లో అతని అనుంగులను ప్రశ్నించామన్నారు. వారు కూడా రవిప్రకాశ్ ఆచూకీ తెలియదని తేల్చిచెప్పడం, రవిప్రకాశ్‌కు సంబంధించిన రెండు సెల్‌ఫోన్ల నంబర్లు సైతం స్విచ్ఛాఫ్ అని వస్తుండటం, సిగ్నల్స్ వివరాలు లభించకపోవడంతో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తాము నిర్ధారణకు వచ్చామన్నారు. రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని టవి9లో ఎవరు ఎన్ని షేర్లు కొనుగోలు చేశారు, ఫోర్జరీ లేఖలను ఎవరు తయారు చేశారు, ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన రికార్డుల తారుమారు అంశాలపై ప్రశ్నించేందుకు తమ పోలీసులు వేట సాగిస్తున్నారు. ఇదే వ్యవహారంలో నటుడు శివాజీకి ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇచ్చామని, మరోసారి రవిప్రకాశ్, శివాజీలకు నోటీసులు ఇవ్వనున్నామని సిపి సజ్జనార్ మీడియాకు తెలిపారు. అయినప్పటికీ స్పందన రాకపోతే అరెస్టు చేస్తామని సిపి వివరించారు.

CP Sajjanar Talks Ravi prakash custody

The post రవిప్రకాశ్‌ అరెస్ట్‌కు ప్రత్యేక బృందం ఏర్పాటు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: