కరోనాపై యుద్ధం చేస్తున్నాం…!

  హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కట్టడికి యుద్దం చేస్తున్నామని…ఇందుకు ప్రజలందరూ సహకరించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని… ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం సహకారంతో పోలీసులు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నామన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ఓవైపు కరోనాను కట్టడిచేస్తూనే… మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు. […] The post కరోనాపై యుద్ధం చేస్తున్నాం…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: నగరంలో కరోనా వైరస్ కట్టడికి యుద్దం చేస్తున్నామని…ఇందుకు ప్రజలందరూ సహకరించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని… ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం సహకారంతో పోలీసులు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నామన్నారు. కోటికి పైగా జనాభా ఉన్న నగరంలో ఓవైపు కరోనాను కట్టడిచేస్తూనే… మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిత్యావసర సరుకులు, కూరగాయల సరఫరాకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో చర్యలు తీసుకున్నామని, ప్రతి నిమిషం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని… ఈక్రమంలో ప్రజలు కూడా క్రమశిక్షణ, సోషల్ డిస్టెన్స్ పాటించి సహకరించాలన్నారు. ఇందుకోసం జాయింట్ పోలీసు కమిషనర్ అవినాష్ మహాంతి ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలతో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు చెక్‌పోస్టులను పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. కరోనాపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడంతోనే కట్టడి సాధ్యమవుతుందని, పోలీసులు చేపట్టే చర్యలకు ప్రతి ఒక్కరూ సహకరింలని కమిషనర్ కోరారు. నగరంలోని పలుప్రాంతాలలో ఉన్న హాస్టల్ యజమానులతో కూడా మాట్లాడి విద్యార్థులు, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.

CP Anjani Kumar Teleconference with Media

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరోనాపై యుద్ధం చేస్తున్నాం…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: