ఆర్థిక స్థిరత్వానికి అనేక చర్యలు చేపట్టాం: ఆర్బీఐ గవర్నర్

COVID worst health and economic crisis in last 100 years

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కారణంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. శనివారం స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బ్యాంకింగ్, ఎకనమిక్స్ కాన్‌క్లేవ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. వందేళ్లలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులు తలెత్తాయని శక్తికాంతదాస్ తెలిపారు. భారత్ లో ఆర్థిక స్థిరాత్వానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. ఉపాధి, ఇతర రంగాలపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా అనేక చర్యలు తీసుకున్నామన్న ఆయన ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల దేశ ఆర్థికవ్యవస్థ సరైన స్థితిలోనే ఉందని తెలిపారు.

ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు వడ్డీ రేట్లను 250 బేసిక్ పాయింట్లు తగ్గించామని గవర్నర్ తెలిపారు. మార్కెట్లో విశ్వాసం నింపేదుకు ద్రవ్య లభ్యత పెంచే దిశగా నిర్ణయాలు తీసకున్నాం. ఆర్థికవృద్ధిని వీలైనంత త్వరగా పరుగులు పెట్టించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు ప్రభావితమయ్యాయి. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత కంపెనీలు మెరుగ్గా స్పందించాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. మూలధన వ్యయంలో కోతలు, నిరర్థక ఆస్తులు సైతం పెరిగే అవకాశముందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆర్థిక స్థిరత్వానికి అనేక చర్యలు చేపట్టాం: ఆర్బీఐ గవర్నర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.