పెనుగాలికి కుప్పకూలిన టోల్‌గేట్

  రైతు దంపతుల దుర్మరణం రాష్ట్ర వాప్తంగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, చెట్లు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షంతో పాటు ఈదురుగాలులు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 వరకు నమోదు కాగా మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పలుచోట్ల కురిసింది. ఈ వర్షానికి పలుచోట్ల […] The post పెనుగాలికి కుప్పకూలిన టోల్‌గేట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రైతు దంపతుల దుర్మరణం
రాష్ట్ర వాప్తంగా, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు, చెట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షంతో పాటు ఈదురుగాలులు పలుచోట్ల బీభత్సం సృష్టించాయి. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 వరకు నమోదు కాగా మధ్యాహ్నం రెండు గంటల తరువాత ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పలుచోట్ల కురిసింది. ఈ వర్షానికి పలుచోట్ల హోర్డింగ్‌లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోగా, హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతా లు జలమయం అయ్యాయి. నగరంలో గంటపా టు కురిసిన ఈ భారీ వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జాం అయ్యింది. భారీ ఈదురుగాలులకు ఇద్దరు దంపతులు సైతం ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద సంఘటన మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ శివారులో మహబూబ్‌నగర్ – కోదాడ హైవే పై నూతనంగా నిర్మిస్తున్న టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారి 167 సమీపంలో చోటు చేసుకుంది. మున్ననూర్‌కు చెందిన డొంక కృష్ణయ్య, పుష్ప దంపతులు టోల్‌గేట్ వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఈదురుగాలులు వీచిన సమయంలో వారిద్దరూ అక్కడే ఉన్నారు. ఉన్నట్టుండి భారీ ఈదురుగాలులు వీయడంతో టోల్‌గేట్ కుప్పకూలిపోయింది. భారీ ఇనుపకడ్డీలు వారిపై పడిపోవడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ ఉమ్మడి మండలాల్లో కూరగాయ, వరిపంటలు నేలకొరిగాయి. పీర్జపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే రైతుకు చెందిన ఎద్దు పిడుగుపాటుకు దుర్మరణం చెందగా, తంగళ్లపల్లి గ్రామానికి చెందిన దేపల్లి లక్ష్మయ్యకు చెందిన ఆవు లేగ దూడ మృత్యువాత పడడంతో ఆ రైతుల ఇంట్లో విషాదం నెలకొంది.

నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం

ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు శనివారం కాస్త ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్‌లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఎస్సార్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సనత్‌నగర్, కార్వాన్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఒడిశా -పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య వాయుగుండం ఏర్పడింది. ఒడిశాలోని పారాదీప్‌కు 1,100కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమైందని అధికారులు పేర్కొన్నారు. మరో 12 గంటల్లో వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం వైపు పయనం

ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో శనివారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది ఆదివారం వాయవ్య దిశకు కదులుతూ 18, 20వ తేదీల్లో ఈశాన్య బంగాళాఖాతం వైపు పయనిస్తుందని ఐఎండి తెలిపింది. దీని ప్రభావంతో ఎపి, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపంది. ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు.

1330 కి.మీల దూరంలో కేంద్రీకృతం

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రఅల్పపీడనం శనివారం (మే 16 వ తేదీన) ఉదయం 05.30 గంటలకు అదేప్రాంతంలో వాయుగుండంగా మారి Lat.10.4 deg N మరియు Long. 87.0 E వద్ద పారదీప్ (ఒరిస్సా) కు దక్షిణ దిశగా 1100 km, డిగా(పశ్చిమ బెంగాల్) కు దక్షిణ దిశగా 1250 km, ఖేపుపర(బంగ్లాదేశ్) కు దక్షిణ నైరుతి దిశగా 1,330 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

సంగారెడ్డిలో 41 మి.మీటర్ల వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే సంగారెడ్డిలో 41 మి.మీటర్ల వర్షపాతం నమోదవ్వగా, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 19.8, ఆదిలాబాద్ 15.8, కామారెడ్డిలో 14.5, మెదక్ 14.5, నిర్మల్ 12.3, వికారాబాద్ 11.3, మంచిర్యాల 11, రాజన్న సిరిసిల్ల 10.8, హైదరాబాద్ (ఖైరతాబాద్‌లో) 29.5 అత్యధిక వర్షపాతం నమోదవ్వగా, గోషామహల్‌లో 0.8 మి.మీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post పెనుగాలికి కుప్పకూలిన టోల్‌గేట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: